ETV Bharat / state

రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ - ఇంకా తెగని కాంగ్రెస్ అభ్యర్థుల పంచాయితీ - కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

Telangana Congress MLA Candidates Issues : నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుండగా.. కాంగ్రెస్ అభ్యర్థుల పంచాయతీ మాత్రం తెగడంలేదు. ఐదారుస్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. పటాన్‌చెరు, సూర్యాపేట, తుంగతుర్తి, నారాయణ్‌ఖేడ్, నర్సాపూర్‌, మహేశ్వరం నియోజకవర్గాల అభ్యర్థులపై తుదినిర్ణయం తీసుకోలేక హస్తం పార్టీ సతమతమవుతోంది. అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చేందుకు ఏఐసీసీ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగుతున్నారు.

Telangana Assembly elections 2023
Telangana Congress MLA Candidates issues
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 9:22 AM IST

రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ ఇంకా తెగని కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పంచాయతీ

Telangana Congress MLA Candidates Issues : నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుండగా కొన్నిస్థానాల అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించినా మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రధానంగా సూర్యాపేట, తుంగతుర్తి , మిర్యాలగూడ, చార్మినార్‌కి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సీపీఎంతో పొత్తుకోసం.. చివర వరకు మిర్యాలగూడను పక్కనపెట్టింది. సీపీఎంతో పొత్తులేకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా లక్ష్మారెడ్డిని బరిలోకి దించనుంది.

Telangana Congress MLA Candidates Selection : చార్మినార్ నుంచి పోటీకి మైనార్టీ నాయకుడు సిద్ధంగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సూర్యాపేట, తుంగతుర్తిలో పట్టున్న దామోదర్‌రెడ్డి, పటేల్‌రమేశ్‌రెడ్డి సూర్యాపేట కోసం పట్టుబడుతుండటంతో ఏకాభిప్రాయం రావట్లేదు. తుంగతుర్తిలో బలమైన నాయకుడు లేకపోవడం.. కొత్తగా చేరిన వారికి సర్వేలు చేసినా బలమైన వ్యక్తి లభించడం లేదు. సూర్యాపేట టికెట్ ఆశిస్తున్న దామోదర్‌రెడ్డి సహకారంతో తుంగతుర్తిలో అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటడటంతో.. పార్టీ తర్జనభర్జన పడుతోంది.

కాంగ్రెస్ బీ ఫామ్​ నిలిపివేసిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట

Telangana Congress MLA Tickets Disputes 2023 : పటాన్‌చెరు అభ్యర్థిగా నీలం మధుకి ప్రకటించినా కోట శ్రీనివాస్‌గౌడ్ అనుచరుల నిరసనతో బీఫారం ఇవ్వకుండా తాత్కాలికంగా నిలుపుదలచేశారు. అక్కడ శ్రీనివాస్ గౌడ్‌కి టికెట్ ఇవ్వాలని దామోదర రాజానర్సింహ డిమాండ్ చేస్తుండగా.. నీలం మధు కోసం జగ్గారెడ్డి పట్టుపడుతున్నారు. నర్సాపూర్ అభ్యర్థి రాజి రెడ్డిని మార్చి టికెట్ ఇవ్వాలని గాలి అనిల్ కుమార్ కోరుతున్నారు. మార్చకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టంచేయడంతో పార్టీ ఎటు తేల్చుకోలేకపోతోంది.

నారాయణఖేడ్‌లో సురేశ్‌ షెట్కార్‌ను ప్రకటించినా..తనకే ఇవ్వాలని సంజీవరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. మహేశ్వరం నుంచి పారిజాత నరసింహారెడ్డి సర్వేలు అనుకూలంగా ఉన్నందున టికెట్ దక్కుతుందని భావించి భంగపాటుకు గురయ్యారు. ఇప్పటికైనా కేఎల్ఆర్ స్థానంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆ ఐదారు స్థానాల్లో టిక్కెట్ల విషయంలో జానారెడ్డి సమన్వయ కమిటీ ఏ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు

Telangana Assembly elections 2023 : నామినేషన్ల గడువు దగ్గరపడుతుండటంతో పీటముడిపడిన ఆ స్థానాల పై చర్చించి ముగింపు పలకాలని పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పారిజాత నర్సింహా రెడ్డి, సంజీవరెడ్డి,గాలి అనిల్ కుమార్ తదితరులు ఠాక్రే ఇతర నాయకులతో సమావేశమైచర్చించారు. నేడు హైదరాబాద్ రానున్న కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, అభ్యర్థులఎంపిక , బుజ్జగింపులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్తగూడెం సీటు వ్యవహారం - ఇంతకీ ఆ సీటు వామపక్షాలకు ఇచ్చినట్టేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టువదలని విక్రమార్కులు - ఒక్క ఛాన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.