ETV Bharat / state

'రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ' ప్రచారం.. కాంగ్రెస్‌ కీలక నిర్ణయం..! - fake news about revanth reddy

Telangana Congress Focused on Fake Posts : పార్టీపై కానీ, నాయకులపై కానీ దుష్ప్రచారం చేసే వారిపై కఠినంగా ముందుకెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో నాయకులను అవమానపరిచేటట్లు పోస్టులు పెట్టడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీకి నష్టపరిచేటట్టుగా, నాయకుల మనోభావాలు దెబ్బ తినేలా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే న్యాయపరంగా ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది.

congress
congress
author img

By

Published : Dec 27, 2022, 12:16 PM IST

Telangana Congress Focused on Fake Posts : నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడానికి సామాజిక మాధ్యమాల్లో నాయకులను అవమాన పరిచేట్లు పోస్టులు పెట్టడమే ప్రధాన కారణమని కాంగ్రెస్‌ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ దూతగా హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌తో జరిపిన చర్చల్లోనూ పలువురు నేతలు సామాజిక మాధ్యమాలలో పోస్టుల అంశాన్ని ప్రస్తావించారు. నాయకుల మనోభావాలను దెబ్బ తినేటట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని… వాటిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మనోభావాలు దెబ్బతీసి అవమానించేలా పెడుతున్న పోస్టులు కారణంగా... తాము తీవ్ర మానసికవేదనకు గురవుతున్నట్లు దిగ్విజయ్‌సింగ్ దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఏఐసీసీ పార్టీకి నష్టం జరిగేటట్లు సామాజిక మధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎవరిపై పోస్టులు పెట్టినా సంబంధిత బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఫిర్యాదు చేయడం సహా న్యాయపరంగా ముందుకెళ్లాలని ఏఐసీసీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా సోమవారం.. జర్నలిస్ట్ శంకర్ పేరుతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. దానిని తీవ్రంగా పరిగణించిన పీసీసీ సంబంధిత ట్వీట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు... పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల దగ్గర నుంచి కార్యదర్శుల స్థాయి వరకు… పదుల సంఖ్యలో వారి వారి ప్రదేశాలల్లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టారని తప్పుడు ట్వీట్ చేసిన వ్యక్తిపై.. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసిన తీరును చూస్తుంటే … సామాజిక మాధ్యమాలలో పోస్టుల విషయంలో ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇతర నాయకులపై తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసినట్లయితే... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు…. ఆయా సంస్థలపై న్యాయపరంగా కూడా ముందుకెళ్లాలని పీసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల తమపై తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరగదన్న విశ్వాసం నేతలకు కల్పించినట్లవుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.