ETV Bharat / state

Telangana Congress Disputes 2023 : కాంగ్రెస్​ పార్టీలో గందరగోళం.. చేరికలతో అయోమయంలో సీనియర్ నేతలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 7:08 AM IST

Telangana Congress Disputes 2023 : అభ్యర్థుల ప్రకటనకు ముందే కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్త జ్వాలలు భగ్గుమంటున్నాయి. కొత్తవారి చేరికలతో తమకు టికెట్‌ వచ్చే అవకాశం లేకపోవటంతో పలువురు నేతలు రాజీనామా బాట పడుతుండగా.. మరికొందరు నేతలు ముందుగానే పార్టీకి సంకేతాలు పంపుతున్నారు. మైనంపల్లి చేరికతో మల్కాజిగిరి, మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే రాజీనామా చేశారు. జూపల్లికి టికెట్‌ వచ్చే అవకాశం ఉండగా.. కొల్లాపూర్‌లోనూ అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలుండగా.. టికెట్ల ప్రకటన అనంతరం, తలెత్తే పరిస్థితులపై పార్టీ నాయకత్వంలో ఆందోళన మొదలైంది.

Telangana Assembly election 2023
Revanth Reddy Meeting with Congress Leaders
Telangana Congress Disputes 2023 కాంగ్రెస్​ పార్టీలో గందరగోళం.. చేరికలతో అయోమయంలో సీనియర్ నేతలు

Telangana Congress Disputes 2023 : రాష్ట్రంలో 70 నుంచి 80 స్థానాలు కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాతో ఉన్న కాంగ్రెస్‌.. గత నెలలో సోనియా చేతులో మీదుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకపోయినా.. ఇప్పటికే బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది.

ఇదే ఊపును ఎన్నికలదాకా కొనసాగించి, అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు అంతర్గత పరిణామాలు తలనొప్పిగా మారుతున్నాయి. కొన్ని చోట్ల బలమైన అభ్యర్థుల కొరత, మరికొన్ని చోట్ల టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొన్న తరణంలో కొత్తగా వచ్చే బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు నాయకత్వం కసరత్తులు కొనసాగిస్తోంది. తమను కాదని కొత్తవారికి ప్రాధాన్యత కల్పిస్తూ టికెట్ల హామీ ఇస్తుండటం పట్ల పార్టీని నమ్ముకున్న నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు.

Telangana Congress Flash Survey : చిక్కంతా డబుల్‌ నేమ్‌లతోనే.. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్‌ కసరత్తు

Nandikanti Sridhar resignes Congress : బీఆర్​ఎస్​లో మంత్రి హరీష్‌రాశ్​తో విబేధాలు తలెత్తి.. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. కాంగ్రెస్‌లో చేరారు. తనకు, తనకుమారుడికి రెండు సీట్లు కావాలని మైనంపల్లి కోరగా.. మెదక్‌ ఇస్తామని.. మల్కాజిగిరి టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని రాష్ట్ర నాయకత్వం చెబుతూ వచ్చింది. కానీ, ఆయన నేరుగా అధిష్ఠానంతో జరిపిన సంప్రదింపులు, ఫ్లాష్‌ సర్వేలో ఇద్దరికీ అనుకూల పరిస్థితులు ఉండటంతో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ నుంచి మినహాయించి, 2 టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Congress Senior Leaders Resignation Telangana : ఈ నేపథ్యంలో అప్పటి వరకు తనకే టికెట్‌ వస్తుందని ఆశతో ఉన్న మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో రాష్ట్ర నాయకత్వం, అధిష్ఠానం పెద్దలు నేరుగా చర్చలు జరిపారు. రాహుల్‌ గాంధీ(RAHUL GANDI) హామీతో దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన.. రెండ్రోజుల పాటు పీసీసీ అధ్యక్షుడితో కలిసి పర్యటనలు సాగించినా.. సోమవారం సాయంత్రం హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అటు, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్‌కు మెదక్‌ టికెట్‌ ఖరారైందన్న సమాచారంతో ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు.

Telangana Congress BC MLA Tickets : కాంగ్రెస్​లో బీసీ టికెట్ల కేటాయింపు లొల్లి.. నియోజకవర్గాల వారీగా ఆశావహులు వీరే..!

Clash Between Congress Leaders : మరోవైపు.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోనూ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్రపోటీ నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరగా(Congress Joinings).. అప్పటికే పార్టీలో ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌ జగదీశ్వరరావు టికెట్‌పై ఆశలు సన్నగిల్లాయి. తొలి నుంచి పార్టీ కోసం కష్టపడిన తనకు కాకుండా ఈ మధ్య చేరిన జూపల్లికి ఎలా టికెట్‌ ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సర్వే ప్రకారం నిర్ణయం తీసుకోవాలని.. జూపల్లికి టికెట్‌ ఇచ్చినా తాను పోటీలో ఉండేదేనని జగదీశ్వరరావు స్పష్టం చేశారు.

Revanth Reddy Meeting with Congress Leaders : గంటల వ్యవధిలోనే ఇద్దరు డీసీసీలు పార్టీకి రాజీనామా(Resign) చేయటం కాంగ్రెస్‌ను ఓ కుదుపు కుదిపేసినట్టైంది. అభ్యర్థుల ప్రకటనకు ముందే రాజీనామాల పర్వం మొదలుకాగా.. జాబితా బయటికొచ్చాక ఆశావహుల నుంచి మరింత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే సోమవారం రాత్రి అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు.. వారితో సమాలోచనలు జరిపారు. టికెట్‌ ఎవరెవరికి వచ్చే అవకాశం లేదో అంచనాకు వస్తే.. వారిని ఎలా బుజ్జగించాలి.. ఎవరిని భాగస్వామ్యం చేయాలనే అంశాలపై ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది.

TPCC Cheif Revanth Reddy Chitchat in Hyderabad : "కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయింది"

BC MLA Ticket Issue in Congress Party : కాంగ్రెస్​లో బీసీ నేతల పోరుబాట.. 34 సీట్లు తమకే ప్రకటించాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.