Telangana Congress Bus Yatra : రాష్ట్రంలో ఈసారి ఎలాగైన అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా బస్సు యాత్ర ద్వారా ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ బస్సు యాత్ర(Congress Bus Yatra)పై నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్.. అందుకు సంబంధించిన విధివిధానాలపై చర్చించేందుకు ఈనెల 10న సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ(Political Affairs Committee) సమావేశం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.
ముందుగా ఈనెల 14 లేదా 15 తేదీలలో బస్సు యాత్ర ప్రారంభించాలని ముందుగా భావించిన 14వ రోజు అమావాస్య కావడంతో 15వ తేదీన బస్సు యాత్రను ప్రారంభించాలని ప్రాథమికంగా భావిస్తోంది. అందుకు ఇటీవల ఓ హోటల్‌లో సమావేశమైన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు ముగ్గురు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సమావేశమై దాదాపు నాలుగు గంటలపాటు చర్చించారు.
Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్, షెడ్యూల్
Telangana Congress to Plan Bus Yatra : అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటినీ చుట్టి వచ్చేందుకే దాదాపు 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు నేతలు అంచనాకు వచ్చారు. అయితే ఇన్ని రోజులు బస్సు యాత్రను చేయడం వల్ల ఇతర కార్యకలాపాలు పూర్తిగా కుంటుపడే అవకాశం ఉందని పీసీసీ భావిస్తోంది. అందుకే 17 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేట్లు.. వీలైనన్ని ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు బస్సు యాత్ర ఉండేటట్లు కార్యాచరణకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
PAC Meeting on Congress Bus Yatra in Telangana : అయితే ఈ విషయంపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఇక్కడ బస్సు యాత్రకు సంబంధించి లోతైన చర్చ నిర్వహించి.. పార్టీకి మేలు జరిగి ఓటర్లను పార్టీవైపు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందన్న అంశంపై చర్చ జరగనుంది.
Priyanka Gandhi Launch Congress Bus Yatra: అదే విధంగా ఈనెల 15వ తేదీన బస్సు యాత్ర ప్రారంభించేందుకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వస్తున్నట్లు చెబుతున్న పీసీసీ వర్గాలు.. ఆమె రెండు రోజులు పాటు రాష్ట్రంలోనే ఉంటారని పేర్కొంటున్నారు. ఈనెల 18,19 తేదీలలో తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలుపుతున్నాయి.. అదే విధంగా మరో రెండు రోజులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారని.. ఇంకా మరికొంత మంది జాతీయ నాయకులు పాల్గొనే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందుతుందని నాయకులు అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.