ETV Bharat / state

నేడే కేంద్ర బడ్జెట్.. ఈసారైనా తెలంగాణకు తోడ్పాటు అందేనా..? - తెలంగాణ బడ్జెట్ వార్తలు

Telangana share in Union Budget 2023-24 : ఎన్నికల ఏడాదైనా కేంద్ర ప్రభుత్వం కరుణించాలని, రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇవాళ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీల నెరవేర్చి.. తెలంగాణకు తోడ్పాటు అందించాలని అంటోంది. రావాల్సిన బకాయిల విడుదల, రైల్వేకు నిధుల మంజూరు సహా పారిశ్రామికంగా తగిన ప్రోత్సాహకాలు కల్పించాలని ఇప్పటికే పలువురు మంత్రులు.. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు.

State On Central Budget
State On Central Budget
author img

By

Published : Feb 1, 2023, 7:01 AM IST

నేడు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌

Telangana share in Union Budget 2023-24 : వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రానికి తగిన తోడ్పాటు అందించాలని, బకాయిలు ఇవ్వడంతోపాటు విభజన చట్టం హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఉపాధి హామీ పథకం అమలుపై ఆంక్షలు తొలగించాలని, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు అవసరమైన 8,453 కోట్లకు తగ్గట్లుగా కేంద్ర బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయాలని కోరింది.

Union Budget Session 2023-24: ఆర్థిక సంఘం సిఫారసులు లేకున్నా బడ్జెటేతర అప్పులపై కేంద్రం విధించిన ఆంక్షలను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు వెనకబడిన జిల్లాలుగా గుర్తించి నిధులు ఇవ్వాలంది. ఐటీఐఆర్‌పై నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా మిషన్ భగీరథ నిర్వహణకు 2,350 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది.

Union Budget 2023-24: ఏపీకి పొరపాటుగా పోయిన 495 కోట్ల సీఎస్ఎస్ నిధులు ఇవ్వాలని కోరింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు చేయాలని కోరుతూ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు కూడా రాశారు. పట్టణాభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని కోరారు. 6,250 కోట్లతో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోకు మద్దతివ్వాలని, ఎంఆర్టీఎస్ కయ్యే 3,050 కోట్లలో 15 శాతం మూలధన పెట్టుబడిగా 450 కోట్లు ఇవ్వాలని కోరారు.

ఘన వ్యర్థాల నిర్వహణ, బయో మైనింగ్ ప్రాజెక్టులు, హైదరాబాద్‌లో ఎస్టీపీల నిర్మాణం, మురుగునీటి సరఫరా నెట్ వర్క్, ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూసీ రిఫర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఎస్సార్డీపీ రెండో దశ, స్కైవేల నిర్మాణం కోసం అవసరమయ్యే 34,500 కోట్లలో కనీసం పదిశాతం 3,450 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 500 కోట్లు నిధులు ఇవ్వాలన్నారు.

ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని, హైదరాబాద్ ఫార్మా సిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు నిధులు ఇవ్వాలని, చేనేత ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంతోపాటు చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని కోరారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు నిధులతోపాటు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టానికి లోబడి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు. భారీ డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏ మేరకు తోడ్పాటు లభిస్తుందో ఇవాళ తేలనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.