ETV Bharat / state

సీఎం రేవంత్ కీలక నిర్ణయం - రాయదుర్గం టు శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేయాలని ఆదేశం - తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం

Telangana CM Puts Hyderabad Airport Metro on Hold : ఔటర్‌ రింగ్‌ రోడ్ వెంట ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రణాళికలు, టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రోమార్గం ఆపేసి పాతబస్తీ, ఎల్బీనగర్ మార్గాలు ప్రత్యామ్నాయంగా అలైన్‌మెంట్‌ తయారు చేయాలని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండాల్సిన అవసరం లేదని, కందుకూరు సమీపంలో సేకరించిన భూముల్లో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని తెలిపారు.

CM Revanth Reddy Review on Hyderabad Metro
CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 7:05 AM IST

మెట్రోరైల్​పై సీఎం సమీక్ష- ఆ మార్గాల్లో మెట్రో నిలిపివేయండి

Telangana CM Puts Hyderabad Airport Metro on Hold : హైదరాబాద్ మెట్రోరైల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విస్తరణ ప్రణాళికలు, ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టు, సంబంధిత అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు వెంట ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ రూపొందించడంపై రేవంత్‌ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. 111 జీవో వల్ల అభివృద్ధికి చాలా తక్కువ అవకాశం ఉండటంతో పాటు ఇప్పటికే మంచి రవాణా సదుపాయం ఉన్న ప్రాంతంలో ఈ అలైన్‌మెంట్‌ ఎలా రూపొందించారని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో అలైన్‌మెంట్‌ ప్లాన్, టెండర్ ప్రక్రియ నిలిపివేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మధ్యభాగం, తూర్పు ప్రాంతం, పాతబస్తీలో ఎక్కువ జనాభా ఉన్నందున వారి సౌలభ్యం కోసం మెట్రోరైల్‌ ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఎంజీబీఎస్- ఫలక్‌నుమా, ఎల్బీనగర్ - చాంద్రాయణగుట్ట ప్రత్యామ్నాయ మార్గాలుగా అలైన్‌మెంట్‌ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.

CM Revanth Reddy Review On Hyderabad Metro : మైలార్‌దేవులపల్లి, జల్‌పల్లి మీదుగా ఒక ప్రత్యామ్నాయం బార్కాస్, పహాడీ షరీఫ్, శ్రీశైలం రోడ్‌ మీదుగా మరో ప్రత్యామ్నాయం రూపొందించాలని మెట్రో రైల్ ఎండీని ఆదేశించారు. ఒంపులు లేకుండా నేరుగా ఉండే మార్గం ద్వారా వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉండటం వల్ల భారం తగ్గుతుందని సీఎం తెలిపారు. ఎల్​ అండ్ టీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇచ్చినప్పటికీ పాతబస్తీ ప్రాంతంలోని ఐదున్నర కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ చేపట్టకపోవడంపై రేవంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. ఎల్​ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చిన రాయితీ ఒప్పందాలను ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - కేంద్రం నిధులు ఏం చేశారని నిలదీత

నలువైపులా హైదరాబాద్‌ అభివృద్ధి చెందడంతో పాటు సమానంగా విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలతో పాటు హైదరాబాద్‌ అభివృద్ధిని సమపాళ్లలో తీసుకుపోవాలనేది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 40 శాతం పట్టణీకరణ జరిగిందని భవిష్యత్‌లో రెండు కోట్లు, తర్వాత మూడు కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.

Telangana CM Proposes Metro From Falaknuma To Airport : మూసీ సుందరీకరణ, నది తీరాన రైట్ అప్ వే ఉపయోగించుకునేలా మంచి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు. నాగోల్ నుంచి గండిపేట వరకు ఈస్ట్-వెస్ట్ రోడ్ కం మెట్రో రైల్ కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు. పశ్చిమ, గల్ఫ్ దేశాలు, ఆగ్నేయాసియాకు లాజిస్టిక్స్, మెడికల్ హబ్‌గా హైదరాబాద్‌కు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి సముద్రం లేనందున డ్రైపోర్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీ హైదరాబాద్ మహానగరానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదని, మరోచోట దూరంగా ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ కోసం భారీగా సేకరించిన భూముల్లో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అక్కడ వచ్చే మెగా టౌన్‌షిప్‌నకు తుక్కుగూడ మీదుగా విమానాశ్రయానికి మెట్రో రైల్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని మెట్రో రైల్ ఎండీని ఆదేశించారు. ఔటర్‌రింగ్ రోడ్డు వెంట శాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలన్న సీఎం, ఆ ప్రాంతాలకు చౌకగా, మంచి రవాణా సదుపాయం కల్పించడంలో మెట్రో రైల్ కీలకపాత్ర పోషించాలని తెలిపారు.

త్వరలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు - సీఎస్, నిఘా అధిపతితో సీఎం సుదీర్ఘ భేటీ!

సచివాలయంలో సీఎం వరుస సమీక్షలు - రైతుబంధు నిధుల విడుదల, డ్రగ్స్ నియంత్రణకు ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.