ETV Bharat / state

తెలంగాణ ప్రగతి దేశమంతటికీ విస్తరిస్తేనే 'సంపూర్ణ క్రాంతి' - KCR Sankranti wishes to Telangana people

KCR Sankranti wishes : దేశ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా చేసుకోవాలని, ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం రాష్ట్ర రైతుల జీవితాల్లో తొణికిసలాడుతోందని, ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదుగొల్పుతామని చెప్పారు.

KCR
KCR
author img

By

Published : Jan 15, 2023, 6:36 AM IST

KCR Sankranti wishes : తెలంగాణ వ్యవసాయరంగం విప్లవాత్మక ప్రగతి దేశమంతటికీ విస్తరించి సంపూర్ణ క్రాంతి సిద్ధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. యావత్‌ భారత ప్రజల సహకారంతో దేశ వ్యవసాయరంగ నమూనాను మార్చి గుణాత్మక అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం రాష్ట్ర రైతుల జీవితాల్లో తొణికిసలాడుతోందని, ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదుగొల్పుతామని చెప్పారు. దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

KCR wishes on Sankranti : ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా చేసుకోవాలని, ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ‘‘పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో చేసుకునే పండుగే సంక్రాంతి. నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలిపే శుభదినమిది. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి దేశానికి మార్గదర్శనంగా నిలిచింది. సాగు బలోపేతం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రమిది." అని కేసీఆర్‌ తమ సందేశంలో తెలిపారు.

"రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,16,000 కోట్లకుపైగా ఖర్చుచేసింది. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది తార్కాణం.రాష్ట్ర ఆవిర్భావం నాటికి కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే సాగు విస్తీర్ణం. ఇప్పుడు అది 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరగడం దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక పరిణామం. ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం నేడు తెలంగాణలో పండుగలా మారింది’’ - కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి

మరోవైపు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌లు రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, రైతులంతా ఈ ఏడాది సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.