ETV Bharat / state

'కరోనా నియంత్రణకు కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది' - కేంద్రానికి కేసీఆర్ మద్దతు

కరోనా నియంత్రణకు కేంద్రం ఏమీ చేయడం లేదనే మాటలు సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

cm kcr on corona virus in assembly
'కరోనా నియంత్రణకు కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది'
author img

By

Published : Mar 14, 2020, 1:30 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు కేంద్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. విదేశాల నుంచి రాకపోకలను నిలిపివేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో పాలకులు బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేయవద్దని సూచించారు.

కరోనా వైరస్​ను నివారించేందుకు రాష్ట్ర సర్కార్​ అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉందని సీఎం కేసీఆర్​ తెలిపారు. "200 మంది వైద్య సిబ్బంది విమానాశ్రయంలో 24 గంటలు పనిచేస్తున్నారు. కరోనా ప్రబలితే దూలపల్లి, వికారాబాద్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అన్ని విషయాలపై ఇప్పటికే చర్చించాం. కరోనా వంటి సున్నిత విషయాలపై రాజకీయాలు చేయవద్దని" కేసీఆర్ కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.