ETV Bharat / state

రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తా: కేసీఆర్​ - kcr tour

తమిళనాడు కాంచీపురంలోని అత్తివరదరాజు స్వామివారిని ముఖ్యమంత్రి కేసీఆర్​ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లారు. రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి జగన్​, తాను  సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.

రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తా
author img

By

Published : Aug 12, 2019, 11:15 PM IST

Updated : Aug 13, 2019, 12:09 AM IST

రాయలసీమను రతనాలసీమ మార్చేందుకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉందని అన్నారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను వాడుకుంటే బంగారు పంటలు పండుతాయని పేర్కొన్నారు. ఏపీకి యువ నాయకుడు, పట్టుదలతో పనిచేసే సీఎం ఉన్నారని... రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి జగన్​తో కలిసి సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. తమిళనాడు కంచిలోని అత్తివరదరాజు స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం రోజా నివాసానికి వెళ్లారు.

సీఎం కేసీఆర్ తమిళనాడు కాంచీపురంలోని అత్తి వరదరాజు స్వామి దర్శనం కోసం ఆయన సతీమణి శోభ, కుమార్తె కవితతో కలిసి ప్రత్యేక విమానంలో ఏపీలోని రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్నారు. కేసీఆర్​ కుటుంబానికి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్​ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి వెళ్లారు. నగరిలో ఎమ్మెల్యే రోజా సీఎం కేసీఆర్​కు స్వాగతం పలికారు. వారితో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండితులు తీర్థప్రసాదాలు అందించారు.

తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి... భోజనం చేశారు. అనంతరం అక్కడి నుంచి రేణుగుంట చేరుకుని హైదరాబాద్​కు తిరిగి పయనమయ్యారు.

రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తా: కేసీఆర్​

ఇదీ చూడండి: 'రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సిఉంది'

Intro:Body:Conclusion:
Last Updated : Aug 13, 2019, 12:09 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.