ETV Bharat / state

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు! - తెలంగాణ క్యాబినేట్ లైవ్ అప్‌డేట్స్

Telangana Cabinet meeting: తెలంగాణ మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన 9వ తేదీ మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేబినెట్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Cabinet
Cabinet
author img

By

Published : Mar 8, 2023, 7:42 PM IST

Updated : Mar 9, 2023, 6:22 AM IST

CM KCR on Cabinet Meet: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ అవుతుంది. ఇండ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కేబినెట్‌లో చర్చించి ఖరారు చేయనున్నారు.

CM KCR on Lands: ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం... ఇళ్ల స్థలాలు, క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ దిశగా కసరత్తు చేస్తోంది. అవకాశం ఉన్నచోట పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను గుర్తించారు. దీంతో పట్టాల పంపిణీకి మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 58, 59 ఉత్తర్వుల కింద క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామకంఠం సహా ఇతరత్రా ఇండ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

CM KCR on Central Govt: మొత్తం కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. పోడు పట్టాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే వైఖరి, రాష్ట్ర ప్రభుత్వంగా అమలు చేయాల్సిన కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఉప్పుడు బియ్యాన్ని తీసుకోబోమని కేంద్రం చెబుతున్న తరుణంలో కొనుగోళ్లకు సంబంధించి ఏం చేయాలన్న విషయమై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

CM KCR on Dalithabandu: దళితబంధు పథకం అమలుపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలో క్రీడా విధాన ముసాయిదా కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడం, నిధుల సమీకరణపై కూడా చర్చించే అవకాశం ఉంది.

CM KCR on MLC Candidates: గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయాల్సిన ఇద్దరి పేర్లను కూడా కేబినెట్ ఖరారు చేయనుంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇతర పాలనా పరమైన, రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

Last Updated : Mar 9, 2023, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.