ETV Bharat / state

సీఎం కేసీఆర్ అధ్యక్షత.. 5న మంత్రి వర్గ సమావేశం - ఈ ఆదివారం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

Telangana Cabinet Meeting: ఈ నెల 6వ తేదీన బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న దృష్ట్యా సీఎం కేసీఆర్​ అధ్యక్షతన కేబినేట్​ సమావేశం కానుంది. ఈ నెల 5వ తేదీన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్​ సమావేశాల నిర్వహణ, విపక్షాలను ఎలా ఎదుర్కొవాలి అనే అంశాలపై చర్చించనున్నారు.

cm kcr
సీఎం కేసీఆర్​
author img

By

Published : Feb 2, 2023, 10:16 PM IST

Telangana Cabinet Meeting On 5th This Month: రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. ఈ నెల ఐదో తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ ప్రగతిభవన్​లో భేటీ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో చర్చిస్తారు. మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.

బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్​లో చర్చిస్తారు. ఇతర పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం బీఆర్​ఎస్​ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.