ETV Bharat / state

డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ సమావేశం : సీఎంవో

telangana elections
telangana Cabinet meeting on December 4
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 3:06 PM IST

Updated : Dec 1, 2023, 5:01 PM IST

15:01 December 01

డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ సమావేశం : సీఎంవో

Telangana Cabinet Meeting on December 4 : డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం(Telangana Cabinet) జరగనున్నట్లు తెలంగాణ సీఎంవో పేర్కొంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నట్లు సీఎంవో ప్రకటన జారీ చేసింది. ఆదివారం శాసనసభ ఎన్నికల(Telangana Elections) ఫలితాలు వెలువడనున్న వేళ.. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల ఫలితాలు వచ్చే మరుసటి రోజే కేబినెట్​ను ఎందుకు సమావేశ పరుస్తున్నారన్న విషయం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే ఫలితాల అనంతరం జరగాల్సిన సాధారణ ప్రక్రియలకు సంబంధించి భేటీ ఉండవచ్చని అంటున్నారు. రాష్ట్ర శాసనసభ గడువు జనవరి 16 వ తేదీ వరకు ఉంది. ఫలితాలు వెలువడిన అనంతరం అసెంబ్లీ, మంత్రివర్గానికి సంబంధించి చేయాల్సిన తీర్మానాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

ఎగ్జిట్​ పోల్స్​ ఎప్పుడూ అంతే - అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి : కేటీఆర్

తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశమే లేదు - ఎల్లుండి 10:30 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు : వికాస్​రాజ్

Last Updated : Dec 1, 2023, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.