ETV Bharat / state

ప్రగతిభవన్​లో సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్​ ప్రగతి భవన్​లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్‌ సమావేశాలు, పట్టణప్రగతి నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

telangana cabinet meet
సీఎం కేసీఆర్​
author img

By

Published : Feb 16, 2020, 3:54 PM IST

Updated : Feb 16, 2020, 9:10 PM IST

సీఎం కేసీఆర్​ అధ్యక్షతన హైదరాబాద్​ ప్రగతి భవన్​లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. పట్టణప్రగతి నిర్వహణపై మంత్రిమండలిలో ప్రధాన చర్చ జరగనుంది. పట్టణ ప్రగతి విధివిధానాలతో పాటు నిర్వహణ తేదీల ఖరారు చేసే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా ఈ నెల 25వరకు పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు, లక్ష్యాలపై కేసీఆర్​ దిశానిర్దేశం చేయనున్నారు. ఈచ్ వన్ టీచ్ వన్‌పై కూడా మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రభుత్వ విధానాన్ని వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు కార్యాచరణ, పంటలకు గిట్టుబాటు ధరలపైనా చర్చించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: 50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Feb 16, 2020, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.