ETV Bharat / state

ఆయిల్ పామ్‌ సాగుకు ప్రోత్సాహం.. రైతులకు రాయితీ

author img

By

Published : Jul 14, 2021, 8:03 PM IST

రాష్ట్రంలో ఆయిల్ పామ్‌ పంట సాగు ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రానున్న 2022-23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Oil Palm
Oil Palm

వరుసగా రెండో రోజు మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏడాది కాలంగా వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం, తదితర విషయాలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులు వివరించారు. వానాకాలం సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. ఏడేళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన విజయాలను సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్‌ పంట సాగు ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు.. మొదటి ఏడాది రూ.26వేలు, తరువాతి రెండేళ్లు ఏటా రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద రాయితీగా అందించాలని నిర్ణయం తీసుకుంది.

దీనిలో భాగంగా అటవీ శాఖ, అటవీ అభివృద్ధి సంస్థతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఆయిల్ పామ్ మొక్కలు, నర్సరీలు పెంచాలని కేబినెట్ సూచించింది. ఈ పంట సాగు విధానం గురించి మరింతగా తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం.. కోస్టారికా, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో పర్యటించాలని మంత్రివర్గం ఆదేశించింది. టీ ఐడియా, తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిబంధనల ప్రకారం ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

ఇదీ చూడండి: cm kcr: ధాన్యాగారంగా తెలంగాణ.. వ్యవసాయంపై మంత్రివర్గ ఉపసంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.