ETV Bharat / state

రానున్న ఆర్థిక సంవత్సరానికి సిద్ధమవుతున్న పద్దు - telangana

రాష్ట్ర బడ్జెట్ అంచనాలను చేరుకుంటోంది. భూముల అమ్మక ప్రతిపాదనలు మినహా మిగతా రాబడి లక్ష్యాలను అందుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆర్థికమాంద్యం ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ పరిమాణాన్ని భారీగా తగ్గించడంతో రాబడుల్లో, కేంద్ర నిధుల్లో తగ్గుదల బడ్జెట్ అంచనాలపై ప్రభావం చూపలేదని విశ్లేషిస్తున్నాయి. వీటన్నింటిని విశ్లేషించుకొని వచ్చే ఏడాది వృద్ధి రేటు అంచనా ఆధారంగా రానున్న ఆర్థికసంవత్సరానికి పద్దు సిద్ధం చేయనున్నారు.

telangana-budget-coming-in-this-financial-year
రానున్న ఆర్థికసంవత్సరానికి సిద్ధమవుతున్న పద్దు
author img

By

Published : Mar 2, 2020, 5:32 AM IST

Updated : Mar 2, 2020, 6:36 AM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ త్వరలో అందరి ముందుకు రానుంది. ఈ నెల 6 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా... 8వ తేదీన వార్షిక పద్దును శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2020-21 ఆర్థికసంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు తుదిదశలో ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపులు, ఖర్చులను ప్రభుత్వ వర్గాలు విశ్లేషించాయి.

మాంద్యం కారణంగా...

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మొదట ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్​తో పోలిస్తే పూర్తి స్థాయి పద్దును భారీగా తగ్గించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యాన్ని ఇందుకు కారణంగా చూపింది. ఆర్థికమాంద్యం ప్రభావం వల్ల రాబడులు తగ్గుతాయని, కేంద్రం నుంచి కూడా నిధులు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వివరించింది. దీనితో లక్షా 80వేల కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... 20శాతం తగ్గించి కేవలం లక్షా 36వేల కోట్ల రూపాయలతోనే పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టింది.

తగ్గిన రాబడులు

మరో పది వేల కోట్ల రూపాయలను భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే ఆర్థికమాంద్యం కారణంగా రాబడులు గణనీయంగా తగ్గాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయి. జీఎస్టీ వసూళ్లలో బాగా ఉన్న రాష్ట్రం ఈ ఏడాది కేంద్రం నుంచి పరిహారాన్ని కూడా పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఉన్నప్పటికీ బడ్జెట్ అంచనాలను మాత్రం చేరుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలనుకున్న పదివేల కోట్లు మాత్రం సాధ్యం కాలేదు. మిగతా లక్షా 36వేల కోట్ల రూపాయల అంచనాను అందుకుంటామన్నది ప్రభుత్వ వర్గాల అంచనా.

బడ్జెట్​పై అంచనాలు

కాగ్ లెక్కల ప్రకారం చూస్తే జనవరితో ముగిసిన మూడో త్రైమాసికం వరకు రాష్ట్రానికి అన్ని రకాలుగా వచ్చిన రాబడి లక్షా ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ అంచనా అయిన లక్షా 36వేల కోట్ల రూపాయల్లో ఇది 77.19శాతం. 2018-19 ఆర్థికసంవత్సరంలో వచ్చిన రాబడుల్లో మాత్రం 58శాతంగానే ఉంది. చివరి త్రైమాసికంలో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయని ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2019-20 సంవత్సరానికి అంచనా వేసిన లక్షా 36వేల కోట్లలో ఇప్పటికే లక్షా ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చాయని... మిగతా 30వేల కోట్ల రూపాయలు కూడా వస్తాయని అంటున్నారు. మొత్తమ్మీద బడ్జెట్ అంచనాలను అందుకుంటామని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఆర్థికవృద్ధి రేటు పది శాతానికి పైగా ఉందని అంచనా. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను ఖరారు చేయనున్నారు.

రానున్న ఆర్థిక సంవత్సరానికి సిద్ధమవుతున్న పద్దు

Last Updated : Mar 2, 2020, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.