Telangana BJP professionals and intellectuals Meet : బీఆర్ఎస్ కుటుంబ పార్టీ.. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవని కేంద్రమంత్రి అమిత్‌షా(Amit Shah) చెప్పారు. బీజేపీ సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ అనీ.. బీఆర్ఎస్(BRS)కు ఏం విధానం ఉందని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన తెలంగాణ బీజేపీ మేధావుల సమావేశం(Telangana BJP Intellectuals Meeting)లో ఆయన పాల్గొని.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక రంగాల్లో భారతదేశం అగ్రస్థానానికి చేరబోతోందని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో దూసుకుపోతోందని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీనని.. బీఆర్ఎస్కు ఏం విధానం ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
Amit Shah Speech in Adilabad BJP Public Meeting : 'డిసెంబరు 3న హైదరాబాద్‌లో కాషాయ జెండా ఎగురుతుంది'
Amit Shah Attended BJP Intellectuals Meeting : బీఆర్ఎస్ కుటుంబ పార్టీనని.. కేటీఆర్‌ను సీఎం చేయడం తప్ప కేసీఆర్‌కు మరో విధానం అన్నదే లేదని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇది అమృత కాలం.. సంకల్పం తీసుకోవాల్సిన కాలమని అన్నారు. బీజేపీ హయాంలో 12 కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చామని వివరించారు. మోదీ ప్రభుత్వం 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్లను రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారని.. డిజిటల్ పేమెంట్ల వ్యవస్థను దేశవ్యాప్తం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
Amit Shah Telangana Tour : కుటుంబ, అవినీతి పార్టీ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దని అమిత్ షా తెలంగాణ ప్రజలను కోరారు. మజ్లిస్‌తో దోస్తీ కారణంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ నిర్వహించలేదన్నారు. కేంద్రం రెండేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోందని మేధావుల సభలో చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలపైనే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మోదీ సర్కార్ తెలంగాణకు తొమ్మిదేళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలను ఇచ్చిందని అన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారని.. ఇక్కడి ప్రజలు అడుగుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని.. మోదీపై భరోసా ఉంచి ఈసారి తెలంగాణలో అవకాశం ఇవ్వాలని అమిత్ షా తెలంగాణ ప్రజలను కోరారు. అంతకు ముందు ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్నారు.
BJP Leader Muralidhar Rao Fires on BRS : 'తెలంగాణలో కుటుంబపార్టీని.. ఓడించడమే బీజేపీ లక్ష్యం'
JP Nadda Fires on BRS : తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో.. కుటుంబ పాలన అంతం కావడం ఖాయం: జేపీ నడ్డా