ETV Bharat / state

ప్రభుత్వ లెక్కల వల్లే కరోనాపై ప్రజల నిర్లక్ష్యం: బండి

రాష్ట్రంలో కొవిడ్​ కేసులు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని బండి సంజయ్​ విమర్శించారు. ప్రజారోగ్యం గాలికొదిలేశారని ఆరోపించారు.

bandi sanjay
బండి సంజయ్​
author img

By

Published : Apr 19, 2021, 7:20 PM IST

ప్రభుత్వ లెక్కల వల్లే కరోనాపై ప్రజల నిర్లక్ష్యం నెలకొందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. రాష్ట్రంలో కొవిడ్​ తీవ్రరూపం దాల్చుతుంటే కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్​ ఒక్కసారైనా సమీక్ష చేయకపోవడం దారుణమని ఆక్షేపించారు. ఆక్సిజన్​, రెమ్​డెసివర్​ ఇంజక్షన్​ కొరత ఏర్పడితే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కొందరు కావాలనే రెమ్​డెసివర్​ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. పలుచోట్ల ఎమ్మార్పీ ధరకంటే అధికంగా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఉందని... కష్టకాలంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ వైద్య సిబ్బందికి జీతాలు, మాస్కులు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు.

కేంద్రం చర్యలు

ప్రజలందరికీ రెమ్​డెసివర్​, ఆక్సిజన్​ అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆక్సిజన్​ సరఫరా చేసేందుకు ప్రధాని మోదీ నిత్యం.... పరిశ్రమలు, రైల్వే, వైద్య శాఖలతో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడం వల్ల రెమ్​ డెసివర్​ కృత్రిమ కొరత ఏర్పడిందని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రులు, వైద్య సిబ్బంది, మందుల విషయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేయాలని సూచించారు. ప్రజలంతా కొవిడ్​ నిబంధనలు పాటించాలని... అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు.

ఇదీ చూడండి: వారాంతపు లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.