ETV Bharat / state

BJP MLAs On Speaker: స్పీకర్​ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఈటల ​ - kcr news

BJP MLAs On Speaker: ప్రజాస్వామ్య స్ఫూర్తి, విలువలను అగౌరవపరిచేలా స్పీకర్​ వ్యవహరిస్తున్నారని భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్​రావు, రాజాసింగ్​ ఆరోపించారు. స్పీకర్​ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. దీనిపై 17న ఇందిరాపార్క్​ వద్ద దీక్ష చేస్తామని తెలిపారు. ఇందులో భాజపా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.

etela rajender
etela rajender
author img

By

Published : Mar 15, 2022, 1:57 PM IST

Updated : Mar 15, 2022, 2:51 PM IST

BJP MLAs On Speaker: శాసనసభ స్పీకర్​ తీసుకున్న నిర్ణయంపై భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందన్​రావు, రాజాసింగ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులను అడ్డుపెట్టుకుని బాధ్యతలు మరిచిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, విలువలను అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. సంప్రదాయబద్ధంగా నడుచుకోవాలనే కోర్టులు సూచిస్తాయని.. కానీ న్యాయస్థానం సూచనలను తుంగలో తొక్కే దుష్ట సంప్రదాయం తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో సభ్యుల అభిప్రాయాలను తీసుకోవాలని స్పీకర్​ను కోరినా.. తిరస్కరించారని ఈటల వెల్లడించారు. ఈ పరిస్థితి ప్రజలకు ఏం మెసేజ్​ పంపుతుందని ప్రశ్నించారు.

ఈనెల 17 దీక్ష చేస్తాం..

తెలంగాణ వస్తే అన్నింటా ఆదర్శంగా మారుతామని ప్రజలు భావించాలని.. కానీ ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితి ఉత్తర కొరియాలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేస్తుందని చెప్పిన ఈటల.. నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు మాట్లాడుతున్న సమయంలో చప్పట్లు కొట్టలేదనే కారణంతో కఠినంగా శిక్షించినట్లు.. ఇక్కడా అలాంటి పరిస్థితి తెస్తారా అని ఈటల రాజేందర్​ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని.. ఈటల విమర్శించారు. ఇందుకోసమేనా రాజ్యాంగం మార్చాలని డిమాండ్​ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్పీకర్​ నిర్ణయంపై 17న ఇందిరాపార్క్​ వద్ద దీక్ష చేస్తామని.. వెల్లడించారు. ఇందులో భాజపా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.

సుప్రీంకు వెళ్తాం..

ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్పీకర్‌ ప్రదర్శించకపోవడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. ఎమ్మెల్యేల హక్కులు కాపాడతానని చెప్పి ఈవిధమైన నిర్ణయం ప్రకటించడం దురదృష్టకరమన్నారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండూ సమాంతరంగా నడవాలని చెప్పారు. ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించుకుంటే బాగుంటుందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. రాష్ట్రాల్లో స్పీకర్లు ఒక్కో విధంగా నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని రఘునందన్​రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్​ నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయిస్తామని చెప్పారు.

వారిని ఎందుకు సస్పెండ్​ చేశారు...

స్పీకర్​ ఎంతో భయంతో తన నిర్ణయాన్ని ప్రకటించారని ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు. స్పీకర్​పై సీఎం కేసీఆర్​ ఎంత ఒత్తిడి పెడుతున్నారనో అర్థమవుతోందని చెప్పారు. బడ్జెట్​ సమావేశాల తొలిరోజు తాను ఒక్కడినే పోడియం వద్దకు వచ్చారని.. మిగిలిన ఇద్దరు సభ్యులు తన స్థానాల్లోనే నిరసన వ్యక్తం చేశారని రాజాసింగ్​ చెప్పారు. మరేందుకు వారిద్దరినీ సస్పెండ్​ చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

BJP MLAs On Speaker: స్పీకర్​ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఈటల ​

ఇదీచూడండి: కోర్టు సూచనలు, మా అభ్యర్థనను సభాపతి తిరస్కరించారు: ఈటల రాజేందర్​

Last Updated : Mar 15, 2022, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.