Telangana BJP MLA Candidates First List 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో దిగే 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాకు.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర (BJP Central Election Committee) వేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన.. దిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో.. కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం రాత్రి సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) , జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్‌తో పాటు కమిటీ సభ్యులైన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర కమిటీ ఆమోదం తెలిపిన జాబితాను బీజేపీ ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను (Etela Rajender) ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌తో పాటు.. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పైనా పోటీకి దింపనుంది. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలుండగా.. ముగ్గురిని శాసనసభ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది.
Telangana Assembly Elections 2023 : కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ని కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును బోథ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. ముగ్గురు, నలుగురు మినహా ముఖ్య నాయకులంతా అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. మాజీ ఎంపీ వివేక్ చెన్నూరు నుంచి.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నుంచి పోటీ చేయనున్నారు.
ఎమ్మెల్యే రఘునందన్‌రావు మరోసారి దుబ్బాక బరిలోనే దిగనున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సస్పెన్షన్ ఎత్తివేతపైనా సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలిసింది. తొలి జాబితాలో పేర్లు ఖరారైన వారిలో పలువురు గత శాసనసభ ఎన్నికల్లో అవే స్థానాల నుంచి పోటీ చేశారు. స్పష్టతరాని స్థానాలపై మరింత కసరత్తు తర్వాత అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌లతో పాటు ముఖ్య నేతలందరినీ బరిలో దింపాలని నిర్ణయించినా.. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం, ఇతర కీలక బాధ్యతల నేపథ్యంలో ఆ ఇద్దరిని పోటీ నుంచి మినహాయించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.
BJP Leaders Meeting on Telangana Elections : దిల్లీలో బీజేపీ నేతల సమావేశం.. తెలంగాణ ఎన్నికలపై చర్చ
BJP Manifesto in Telangana 2023 : మరోవైపు ప్రజల్ని ఆకర్షించేలా ఎన్నికల ప్రణాళికను బీజేపీ సిద్ధం చేస్తోంది. అన్ని వర్గాలకు చెందిన అంశాలు పొందుపరిచేలా.. మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. మేనిఫెస్టోలో కర్షకులు, ఉచిత విద్య, ఉచిత వైద్యం.. మహిళలు, యువత, ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన ప్రణాళికకు దీటుగా.. కమలం పార్టీ ప్రకటించే మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
BJP Assembly Election Plan 2023 : బీసీ నినాదంతో జనంలోకి వెళ్లనున్న బీజేపీ..
BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు