Telangana BJP MLA Candidate Second List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Election 2023)లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల జాబితాపై తీవ్ర కసరత్తు చేస్తున్న అధిష్ఠానం.. 52 మందితో కూడిన తొలి జాబితా(Telangana BJP First List)ను విడుదల చేసింది. ఇంకా మరో 67 మంది అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అధిష్ఠానం నేడు మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేస్తూ.. రెండో జాబితాను విడుదల చేసింది.
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ బరిలోకి దించుతుంది. ఈ మేరకు ఒక్క అభ్యర్థి పేరుతో కూడిన రెండో జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారును నెలకొల్పాలనే సంకల్పంతో కేంద్ర బీజేపీ నాయకత్వం ఉందని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Telangana BJP MLA Candidate First List Released : అక్టోబరు 22న బీజేపీ 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో బీసీలతో పాటు సీనియర్లకు కూడా స్థానం ఇవ్వగా.. ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. కోరుట్ల నుంచి ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ పోటీ చేయగా.. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. బోథ్ నుంచి సోయం బాపూరావు బరిలోకి దిగి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ రెండు స్థానాల్లో ఈటల రాజేందర్ పోటీ పడగా.. మరోస్థానంలో కామారెడ్డి నుంచి వెంకట రమణారెడ్డిను బరిలో ఉంచారు.
BJP Plan For Telangana Election 2023 : ప్రస్తుతం గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ను మరోసారి అదేస్థానం నుంచి పోటీకి దించారు. ఈ నేపథ్యంలో అతనిపై గతేడాది వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రఘునందన్ రావు దుబ్బాక నుంచే పోటీ చేయనున్నారు. ఇలా తొలి జాబితాలో 19 మంది బీసీలు, 12 మంది మహిళలకు పెద్ద పీట వేశారు. 8 మంది ఎస్సీలు, 14 ఎస్టీలు, 12 మంది రెడ్డి సామాజిక వర్గానికి, ఐదుగురు వెలమ వర్గానికి చెందిన వారికి జాబితాలో అవకాశం కల్పించారు.
అయితే ఈ జాబితాలో కొంతమంది పేర్లు లేవు. విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు లేవు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వివేక్ సైతం కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం జరగగా.. ఆ అసత్య ప్రచారాన్ని ఖండించారు. ఇలా మొదటి జాబితాలో 52 మందితో కూడిన బీజేపీ సేన.. రెండో జాబితాలో కేవలం ఒక్కరితోనే రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
BJP Janasena Alliance in Telangana : బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది..! ఇక సీట్ల లెక్క తేలాలి