ETV Bharat / state

తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం - లోక్​సభ ఎన్నికల వేళ జిల్లాలకు కొత్త అధ్యక్షులు

Telangana BJP District New Presidents: పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త జట్టును సిద్ధం చేసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పలు జిల్లాల అధ్యక్షులతో పాటు మోర్చాల చీఫ్​లను మార్చి ఆయా స్థానాల్లో తనకు అనుకూలంగా ఉన్న వారికి చోటు కల్పించారు. 35 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ స్టేట్​ చీఫ్ మరో మూడు జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్‌లో ఉంచారు. పార్టీ అనుబంధ సంఘాలైన మోర్చాలకు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది.

BJP Districts Chief Changed
BJP New Team For Parliament Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 11:26 AM IST

BJP New Team For Parliament Elections పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ జిల్లా అధ్యక్షులను మార్చిన రాష్ట్ర అధ్యక్షుడు

Telangana BJP District New Presidents : పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు 10 ఎంపీ సీట్లు, 35శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా కమలం పార్టీ (BJP) పెట్టుకుంది. దీంతో శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో పాటు పనితీరు బాగాలేని జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా 33 జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చాలా మంది జిల్లా అధ్యక్షులకు మరోసారి అవకాశం కల్పించారు. మూడు జిల్లాలు అదిలాబాద్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు మూడ్రోజుల్లో ఈ మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పాలమూరు బీజేపీ లోక్​సభ సీటు ఎవరిది? - రేసులో ఆ ముగ్గురు కీలక నేతలు

Telangana BJP New Team Lok Sabha Elections 2024 : వికారాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాధవరెడ్డిని నియమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు(Kishan Reddy), యాదాద్రి భువనగిరి జిల్లాకు భాస్కర్, నిజామాబాద్‌కు దినేష్‌, సిద్దిపేట జిల్లాకు మోహన్‌రెడ్డిని నియమించారు. జనగామ జిల్లా బాధ్యతలు దశమంతరెడ్డికి, హన్మకొండ జిల్లా రావు పద్మ, కామారెడ్డి జిల్లా అరుణ తార, కరీంనగర్ బాధ్యతలు కృష్ణా రెడ్డికి అప్పగించారు.

BJP New Team For Parliament Elections జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా పైడిపల్లి సత్యనారాయణ రావు, ఖమ్మం - గల్లా సత్యనారాయణ, మేడ్చల్ అర్బన్ - పన్నాల హరీశ్‌రెడ్డి, మేడ్చల్ రూరల్ - విక్రమ్‌రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ - గౌతమ్ రావులను జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు. అలాగే, పార్టీ అనుబంధ మోర్చాలకు స్టేట్ చీఫ్​గా కొత్త వారికి అవకాశం కల్పించారు. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్యాణ్‌ నాయక్‌, ఎస్సీ మోర్చా స్టేట్ చీఫ్ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, యువ మోర్చా - సేవెల్లా మహేందర్, ఓబీసీ మోర్చా - ఆనంద్ గౌడ్, మహిళా మోర్చా - డాక్టర్ శిల్ప, కిసాన్ మోర్చా - పెద్దోళ్ల గంగారెడ్డిలను నియమించారు.

పార్లమెంట్​ ఎన్నికల నోటిఫికేషన్​ ఫిబ్రవరి 28న రావచ్చు : కిషన్​రెడ్డి

రాష్ట్ర ప్రధానకార్యదర్శుల్లో ఇద్దరిపై వేటు: నూతన జట్టను ప్రకటించిన కాసేపటికే కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై రాష్ట్ర నాయకత్వం డైలమాలో పడింది. కిసాన్ మోర్చా, మైనార్టీ మోర్చాలకు త్వరలో అధ్యక్షులను ప్రకటిస్తామని మరో ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు, చేర్పులు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న నలుగురిలో ఇద్దరికీ ఉద్వాసన పలికి, కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పదాధికారుల మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.