రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు రాజేష్ యాదవ్ కలిశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో జరగనున్న వీసీల నియామకాల్లో 50 శాతం బీసీ వర్గాలకు చెందిన వారిని నియమించడంతో పాటు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్గా బీసీలను నియమించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.
రెండేళ్లుగా వర్సిటీలకు రెగ్యూలర్ వైస్ ఛాన్స్లర్ లేక శాఖపరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రికి వివరించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కాలపరిమితి ముగిసినా.. వారికి రెండు దఫాలుగా పొడిగించిన కాలపరిమితి అయిపోయిందని రాజేష్ అన్నారు. ఈ విషయంపై సీఎంతో చర్చించి బీసీలకు తగిన న్యాయం చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః ఇకపై ఇంటివద్దనే జీవన్ ప్రమాణ్ ధ్రువపత్రం అందజేత