హైదరాబాద్ డీడీ కాలనీలో కబ్జాలకు గురైన ఉస్మానియా యూనివర్సిటీ భూమిని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ పరిశీలించారు. ఓయూ అధికారులు విశ్వవిద్యాలయంకు సంబంధించిన భూములను తక్షణమే రీసర్వే చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కబ్జాలకు కొమ్ము కాస్తున్నటువంటి యూనివర్సిటీ అధికారులను వెంటనే శిక్షించాలన్నారు.
మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి ఆక్రమించిన భూమిపై ఇంతవరకు న్యాయవ్యవస్థను ఆశ్రయించకపోవడమనేది యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటి వరకు కబ్జాలకు గురైన యూనివర్సిటీ భూముల కోసం న్యాయ పోరాటం చేయాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకోపోతే కబ్జాదారుల వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా విద్యార్థి సంఘాల ఐక్యతతో ఉస్మానియా యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని అంజి యాదవ్ స్పష్టం చేశారు.