ETV Bharat / state

Telangana Assembly Sessions 2023 : ఎన్నికల ముంగిట చివరి అసెంబ్లీ సమావేశాలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమైన విపక్షాలు - టీఎస్ అసెంబ్లీ సమావేశాలు 2023

Opposition Parties Strategies in Telangana Assembly Sessions 2023 : ఎన్నికల ముంగిట జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. వర్షాలతో జరిగిన నష్టం, అమలు కాని ఎన్నికల హామీలపై సర్కార్‌ను నిలదీయాలని నిర్ణయించాయి. ప్రజా సమస్యలను చర్చించేందుకు కనీసం 20 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పట్టుబడుతోంది.

Telangana Assembly Sessions 2023
Telangana Assembly Sessions 2023
author img

By

Published : Aug 3, 2023, 6:57 AM IST

Updated : Aug 3, 2023, 7:07 AM IST

Telangana Assembly Sessions 2023 : ఎన్నికల ముంగిట చివరి అసెంబ్లీ సమావేశాలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమైన విపక్షాలు

Telangana Assembly Sessions 2023 : బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై వివిధ అంశాలపై పోరుబాట పట్టిన విపక్షాలు.. ఇవాళ్టి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హ‌మీల అమ‌లుపై చర్చ కోసం కాంగ్రెస్ పట్టుబట్టాలని భావిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, టీఎస్‌పీఎస్సీ వైఫల్యాలు, రెండు పడక గదుల ఇళ్లు, ధరణి పోర్టల్‌ లోపాలు, 111 జీవో ఎత్తివేతతో తలెత్తనున్న ఇబ్బందులు, రుణమాఫీ, దళితబంధు, బీసీ బంధు, ఓఆర్‌ఆర్‌ టెండర్‌ తదితర అంశాలపై ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది. ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉండడంతో తిప్పి కొట్టే వ్యూహాలు సిద్ధం చేసింది. ఇటీవల కురిసిన వర్షాలతో నష్టాలు, ప్రజల ఇబ్బందులపై సభలో ప్రత్యేకంగా ప్రస్తావించాలని సీఎల్పీ నిర్ణయించింది.

BJP Strategy on Assembly Sessions 2023 : మరోవైపు బీజేపీ సైతం ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని అసెంబ్లీలో ప్రశ్నించి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలించకుండా.. మహారాష్ట్ర పర్యటనలకు వెళ్లడం, నిరుద్యోగ భృతి, ఒకే నెలలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు సహా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. ఇదిలా ఉండగా.. విపక్షాల వ్యూహాలకు అనుగుణంగా సభలో అధికార పక్షం ఎలా వ్యవహరిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

సమావేశాల పని దినాలు నేడు ఖరారు.. : రాష్ట్ర శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు ఉభయసభలు విడివిడిగా సమావేశం కానున్నాయి. ఇటీవల మరణించిన కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్నకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. సభా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెడతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సమావేశాల పని దినాలు, ఎజెండా ఇవాళ ఖరారు కానుంది. ఇందుకోసం సభా వ్యవహారాల సలహా సంఘాలు సమావేశమై పని దినాలు, చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులను ఖరారు చేయనున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సమావేశాలే చివరివి అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రభావం సమావేశాలపై పడనుంది. అధికార, విపక్షాలు ఉభయ సభల ద్వారా తమ వాణిని బలంగా వినిపించేందుకు ప్రయత్నించనున్నాయి.

ఇవీ చూడండి..:

Congress on Assembly Sessions 2023 : అసెంబ్లీలో బీఆర్ఎస్​ను నిలదీసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న కాంగ్రెస్

LB Nagar to Nagole metro : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఎల్బీనగర్ - నాగోల్ మెట్రో లింకు పనులు ప్రారంభం..

Last Updated : Aug 3, 2023, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.