టీఎస్ బీపాస్ అమలుతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవన నిర్మాణ రంగానికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. పరిమిత కాలంతో నిర్మాణాలకు అనుమతులు ఇస్తామన్నారు. టీఎస్ బీపాస్ బిల్లును శాసన సభలో మంత్రి ప్రవేశపెట్టారు. బిల్లు అమలు విషయంలో లోతుగా అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు.
అధికారులు 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. 21 రోజుల్లో అనుమతి రాకపోతే 22వ రోజున అనుమతి వచ్చినట్లు పరిగణించాలని చెప్పారు. కాలపరిమితితో జవాబుదారీతనం తీసుకొస్తూ చట్టం తీసుకువచ్చామని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తామని చెప్పారు. బీ పాస్ అమలుపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అన్ని పట్టణాలకు మాస్టర్ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఎలాంటి సవరణలు లేకుండానే టీఎస్ బీపాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.