ETV Bharat / state

అసెంబ్లీ సమరానికి తెలంగాణ సై - పోలింగ్ ఏర్పాట్లలో బిజీబిజీగా ఈసీ - సీఈఓ వికాస్‌రాజ్‌

Telangana Assembly Elections Polling Arrangements 2023 : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఈవీఎంలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయగా.. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. 12,000కు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.709 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన సీఈఓ వికాస్‌రాజ్.. ప్రభుత్వం నుంచి వచ్చిన 10 విజ్ఞప్తుల్లో ఒకదానిని తిరస్కరించినట్లు చెప్పారు.

Telangana Assembly Polling Arrangements 2023

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 7:55 AM IST

రాష్ట్రంలో పోలింగ్‌ ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం

Telangana Assembly Elections Polling Arrangements 2023 : ఈనెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం (Telangana Assembly Elections).. ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ఇప్పటికే పూర్తికాగా.. పోలింగ్ బృందాలు సిద్ధమయ్యాయి. హోం-ఓటింగ్ ప్రక్రియ పూర్తికాగా.. 26,660 మంది ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. 80ఏళ్లకు పైబడిన వారు 15,879 మంది, దివ్యాంగులు 9,374 మంది ఇంటి వద్ద ఓటు వేయగా.. అత్యవసర సేవల్లో ఉన్న 1407 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.

Postal Ballet Votes Telangana 2023 : ఎన్నికల విధుల్లో ఉండే వారికి.. పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ప్రక్రియ కొనసాగుతుండగా..1.31 లక్షల సిబ్బంది, 35,978 పోలీసులు, 1150 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 1,68,612 పోస్టల్ బ్యాలెట్‌లు ఇచ్చినట్లు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఇప్పటి వరకు 96,526 మంది ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. 54.39 లక్షల ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ, పంపిణీ దాదాపుగా పూర్తైనట్లు వికాస్‌రాజ్‌ వివరించారు.

"35,978 పోలీసులకు పోస్టల్ బ్యాలెట్‌లు ఇచ్చాం. ఇతరులకు 1150 మందికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాం. హోం-ఓటింగ్ ప్రక్రియ ద్వారా 26,660 మంది ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 80ఏళ్లకు పైబడిన వారు 15,879 మంది, దివ్యాంగులు 9,374 ఉన్నారు. అత్యవసర సేవల్లో ఉన్న 1407 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మొత్తం 1,68,612 పోస్టల్ బ్యాలెట్‌లు ఇచ్చాం." - వికాస్‌రాజ్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ

ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు : శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వీరిలో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు వికాస్‌రాజ్‌ (Telangana CEO Vikasraj) పేర్కొన్నారు. 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22,000ల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్,.. ఇతరులు మొత్తం కలిపి 2 లక్షలకు పైగా పోలింగ్ విధుల్లో ఉన్నారని చెప్పారు. 45,000 మంది రాష్ట్ర పోలీసులు.. 23,500 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులు.. 3000 మంది రాష్ట్రానికి చెందిన ఇతర శాఖల యూనిఫాం సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉంటారని వివరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు : పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించడంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రవాణా సదుపాయంతోపాటు ప్రతి చోటా ఉండేలా 20 వేలకుపైగా వీల్ ఛైర్స్ సిద్ధం చేస్తున్నారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. అన్ని ఈవీఎంల వాహనాలను జీపీఎస్‌ సదుపాయంతో ట్రాకింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అధికార యంత్రాంగం అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

Telangana Assembly Elections 2023 : ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సీఈసీ కసరత్తు.. ఆకర్షణీయంగా పోలింగ్​ కేంద్రాల ముస్తాబు

అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు కట్టుదిట్టం : రాష్ట్ర వ్యాప్తంగా 27,051 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉండనుండగా.. ఒకటికి మించి పోలింగ్ బూత్‌లు ఉన్న కేంద్రాల వద్ద బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. మద్యం సరఫరా, పంపిణీ, నిల్వలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎక్సైజ్ శాఖను ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. పోలింగ్‌కు ముందు చివరి 48 గంటల్లో 144 సెక్షన్ ఉంటుందని, ఈ సమయంలో ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఇతర నియోజకవర్గాలు, ప్రాంతాల వారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు వెళ్లిపోవాలని అన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు కట్టుదిట్టం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణలో సవాళ్లు - కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని నియోజకవర్గాలపై ఈసీ నజర్

Huge Amount of Money Seized in Telangana : రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న తనిఖీల్లో.. ఇప్పటివరకు మొత్తం రూ.709 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నామని వికాస్‌రాజ్ వివరించారు. ఇందులో రూ.282 కోట్లు నగదు, రూ.118 కోట్ల విలువైన మద్యం, రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్,.. రూ.186 కోట్ల విలువైన బంగారం, ఇతర ఆభరణాలు, రూ.83 కోట్ల విలువైన ఇతర కానుకలు ఉన్నట్లు తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 7626 ఫిర్యాదులు వచ్చాయని.. నిబంధనల మేరకు 100 నిమిషాల్లోపు చర్యలు తీసుకుంటున్నట్లు వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు.

Telangana Assembly Election 2023 :ఈసీ నోటీసుపై కేటీఆర్‌ (Minister KTR) నుంచి ఇంకా వివరణ అందలేదన్న సీఈఓ వికాస్‌రాజ్.. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 విజ్ఞప్తులలో ఒకటి తిరస్కరించగా, తొమ్మిది ఆమోదం పొందినట్లు చెప్పారు. విశ్రాంత ఐఏఎస్‌ ఏకే గోయల్ ఇంట్లో ఏమీ దొరకలేదని ప్రాథమిక నివేదిక వచ్చిందని, పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

EC Focus on Social Media Campaign : సోషల్​ మీడియాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారా ఈసీ ఓ కంట కనిపెడుతోంది జాగ్రత్త సుమీ

Excise Department Searches in Telangana : ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ అలర్ట్.. మద్యం, డ్రగ్స్ సరఫరాపై పటిష్ఠ నిఘా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.