ETV Bharat / state

Telangana Elections 2023 : ఎన్నికలకు బూత్ స్థాయి అధికారుల శిక్షణ షురూ - అసెంబ్లీ ఎన్నికలు

Telangana Assembly Elections Exercise 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు రెండు విడతల్లో శిక్షణ పూర్తి కాగా.. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు కూడా శనివారం శిక్షణ ఇచ్చారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ల జాబితా సంబంధిత అంశాలపై బీఎల్ఓలకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలని సీఈఓ వికాస్​రాజ్ తెలిపారు.

Telangana Elections 2023
Telangana Elections 2023
author img

By

Published : Jul 16, 2023, 7:10 AM IST

Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 34,891 మంది బూత్ స్థాయి అధికారుల శిక్షణా ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు రెండు విడతల్లో శిక్షణ పూర్తి కాగా.. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శనివారం శిక్షణ ఇచ్చారు. ఓటర్ల జాబితా తయారీలో బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్ల పాత్ర, సంబంధిత అంశాలపై శిక్షణ ఇచ్చారు.

జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్.. బీఎల్ఓలకు అన్ని అంశాలపై సంపూర్ణంగా శిక్షణ ఇవ్వాలని అన్నారు. అందుకు అనుగుణంగా శాసనసభ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితా సంబంధిత అంశాలపై బీఎల్ఓలకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలని సీఈఓ వికాస్​రాజ్ సూచించారు. ఈ నెల 18న అన్ని జిల్లాల్లో శాసనసభ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారని, ఆ తర్వాత మరుసటి రోజు నుంచి 25 వరకు అన్ని మండలాల్లో బీఎల్ఓలకు శిక్షణ ప్రక్రియ పూర్తి చేయాలని అదేశించారు.

Telangana Assembly Elections Exercise : అయితే కొన్ని జిల్లాల నుంచి ఇంకా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వివరాలు అందాల్సి ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను రెండోసారి చేపట్టింది. ఇందుకోసం గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను ఈసీ సవరించింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21న ముసాయిదా జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల పక్రియ కొనసాగుతోంది. అక్టోబరు ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.

Assembly Elections in Telangana : ముసాయిదాపై సెప్టెంబరు తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలు, వినతులకు గడువు ఇచ్చారు. వాటన్నింటిని పరిష్కరించి తుది జాబితా సిద్ధం చేసి అక్టోబరు 4వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తనిఖీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రానున్న ఎన్నికలకు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐఎల్‌ తయారు చేసిన కొత్త ఈవీఎంలను వినియోగించనున్నారు. ఈ యంత్రాలకు సంబంధించిన ఫస్ట్ లెవల్ చెకింగ్ - ఎఫ్‌ఎల్‌ఏ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. అటు ఎన్నికల విధులు, నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణ ప్రక్రియ దశ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.