ETV Bharat / state

నియోజకవర్గాల్లో ప్రచార హోరు గల్లీ గల్లీ తిరుగుతూ ఓట్ల వేటలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు - బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Telangana Assembly Elections Campaign 2023 : నియోజకవర్గాల్లో ప్రచార హోరు కొనసాగుతోంది. గల్లీ గల్లీ తిరుగుతున్న అభ్యర్థులు గెలిపించాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే.. మూడోసారి అవకాశమివ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్ని కోరుతున్నారు. ఆరు గ్యారెంటీలే ప్రధాన ప్రచారాస్త్రంగా ఊరూరా తిరుగుతున్న కాంగ్రెస్‌ నేతలు.. హస్తానికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కమలనాథులు సైతం అభ్యర్థులు ఖరారైన స్థానాల్లో ప్రచార జోరు పెంచారు.

Election Strategy of Political Parties
Election Campaign Noise of Major Political Parties
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 7:44 PM IST

Telangana Assembly Elections Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకూ మరింత రాజుకుంటోంది. ప్రధానంగా మూడు పార్టీల నడుమ త్రిముఖ పోరు ప్రతిబింబిస్తోంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు(BRS Candidates) నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని కాలనీల్లో ప్రచారం నిర్వహించిన దానం నాగేందర్‌.. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్​లో పద్మారావుగౌడ్‌ తెలంగాణ అభివృద్ధిని వివరిస్తూ వినూత్న ప్రచారం నిర్వహించారు.

KTR Attended BRS Activists Meeting at Bikkanur : ఎన్నికల్లో దిల్లీ దొరలకు గల్లీ ప్రజలకు మధ్య పోరాటం అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ

Minister Srinivas Yadav Election Campaign Start : సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్‌పేట డివిజన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ గులాబీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో పలువురు మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్​లో చేరారు. స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గం లింగాల ఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేసిన కారు పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి.. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాయమాటలు నమ్మొద్దని సూచించారు.

తెలంగాణ విపక్ష పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం ఇచ్చి.. ఎన్నికల సందర్భంగా నగదు బదిలీ పథకాలన్నీ ఆపివేయాలని విజ్ఞప్తి చేశాయి. నగదు బదిలీ పథకాలు అంటే.. మన బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న రుణమాఫీ, దళితబంధు, రైతుబంధు స్కీమ్​లు. ఈ మూడు కూడా కొత్త పథకాలు కావు. ఎన్నికల నియమావళి ప్రకారం పాత పథకాలన్నీ కొనసాగించుకోవచ్చు. కానీ నగదు బదిలీ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుందనే దురుద్దేశంతో ఆ ఇరు పార్టీలు ఈ పథకాలన్నింటినీ నిలిపివేయాలని ఈసీని కోరాయి. - కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ అభ్యర్థి

MLA Sitakka Door-to-Door Election Campaign : కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. హుస్నాబాద్ బీజేపీ పట్టణ నాయకులు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి పలు గ్రామాలలో పాదయాత్ర ప్రచారం చేస్తున్నారు. ములుగు మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క ఆరు గ్యారంటీలను(Congress Six Guarantees) వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు.

Rahul Gandhi Speech at Kollapur Meeting : 'కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు నిలిచిపోతుందనేది దుష్ప్రచారం.. కౌలు రైతులకూ రైతు భరోసా ఇస్తాం'

చింతలపల్లి గ్రామానికి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ ఇళ్లే ఇక్కడ ఉన్నాయి. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఉన్న అరకొర మౌలిక వసతులు సైతం కాంగ్రెస్ హయాంలో సమకూర్చినవే. వందల ఎకరాలు ఉన్నవారికి బీఆర్ఎస్ రైతుబంధు ఇస్తుంది. కానీ ఏమీలేని వారిని కనీసం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి కాంగ్రెస్​ను గెలిపించుకుంటే మాత్రం భూమి లేని వాళ్లకు సైతం రైతుబంధు కింద రూ.12 వేలు ఇచ్చేలా గ్యారెంటీ కార్డులో నమోదు చేయడం జరిగింది. - సీతక్క, ములుగు కాంగ్రెస్‌ అభ్యర్థి

BJP MLA Candidates Election Campaigning : బీజేపీ అభ్యర్థులు సైతం ఒక్కసారి తమకు అకాశం ఇవ్వాలని నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో తుంగతుర్తి గులాబీ పార్టీ(BJP Party) అభ్యర్థి కడియం రాంచంద్రయ్య పనకబండ, రాగిబావి, ముశిపట్ల అనాజిపురం గ్రామాల్లో ప్రచారాన్ని కొనసాగించారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ కమలం అభ్యర్థి మిథున్‌రెడ్డి అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

BJP MLA Candidates Final List Telangana : రేపే బీజేపీ తుది జాబితా 26 స్థానాలు కోరిన జనసేన 10 సీట్లే ఇవ్వాలనుకుంటున్న కమలం పార్టీ

Political Parties Focus on Hyderabad : హైదరాబాద్‌కు అధినేతలు రావాలి ప్రచారం హోరెత్తాలి భాగ్యనగర ఓటర్ల మనసు గెలుచుకోవాలి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.