Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకం. పోలింగ్ రోజు వారు తమ ఓటుహక్కును వినియోగించుకోవడం పైనే మొత్తం ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది ఓటు వేసి ఓటింగ్ శాతం ఎంత ఎక్కువగా నమదైతే ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు అంత మంచింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఆకర్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)ఎన్నో చర్యలు తీసుకుంటుంది.
Election Code in Telangana : ఓటరు నమోదు ప్రక్రియ(Voter Registration Process) మొదలు పోలింగ్ రోజు వరకు వివిధ అవగాహనా కార్యక్రమాలు చేపడుతుంది. పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు అవసరమయ్యే వసతులను విధిగా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలను ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక నమూనా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. స్థానిక పరిస్థితులు, సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు అద్దం పట్టేలా ఈ నమూనా పోలింగ్ స్టేషన్లను తీర్చిదిద్దుతారు.
Telangana Assembly Elections 2023 : అలాగే వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ఆయా వర్గాల సిబ్బంది విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటారు. పూర్తిగా ఆయా వర్గాలకు చెందిన ఉద్యోగులే పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తించేలా కేటాయింపు చేస్తారు. లింగ సమానత్వం, మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా పూర్తి స్థాయిలో మహిళా సిబ్బంది ఉండేలా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈసీ సూచించింది. పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులు, ఇతర సిబ్బంది కూడా మహిళలే ఉండాలని దివ్యాంగులకు సంబంధించి కూడా ఇదే తరహా ఏర్పాటుకు ప్రయత్నించాలని తెలిపింది.
List of polling Stations in Telangana 2023 : జిల్లాలో ఉన్న యువ ఉద్యోగుల ఆధ్వర్యంలో పోలింగ్ జరిగేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని నమూనా పోలింగ్ కేంద్రాలు, ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో పట్టణ ప్రాంతాల్లో ఉన్నవి 14,464, గ్రామీణ ప్రాంత కేంద్రాలు 20,892. వీటిలో నమూనా కేంద్రాలుగా 644 తీర్చిదిద్దినున్నారు.
Responsibilities for Young Employees in Telangana Elections : స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, సమ్మక్క-సారక్క, బోనాలు, స్థానిక సంస్కృతి, హైదరాబాద్లోని చార్మినార్, హైటెక్ సిటీ లాంటి వాటిని వివరించేలా అలంకరణ చేయనున్నారు. ఆకర్షణీయంగా ఉండేలా ఇతర ఏర్పాట్లు చేస్తారు. 597 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళలే నిర్వహించనున్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులు, ఇతర సిబ్బంది కూడా మహిళలే ఉంటారు. 120 కేంద్రాలను దివ్యాంగులు నిర్వహిస్తారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కేంద్రాల్లో యువ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తారు. తద్వారా అన్ని వర్గాలను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులను చేయడంతో పాటు వారిని పోలింగ్ కేంద్రాలకు ఆకర్షించాలన్నది ఈసీ ఆలోచన.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..