ETV Bharat / state

'రవీంద్రభారతిలో రేపు మారథాన్ కళా ప్రదర్శనలు'' - Telangana Art Festival-2021 tomorrow

'తెలంగాణ కళా ఉత్సవం-2021' పేరుతో రవీంద్రభారతితో రేపు కళా ప్రదర్శనలు ఉంటాయని 'టార్సా' అధ్యక్షుడు విక్రమాదిత్య పేర్కొన్నారు. 12 గంటల పాటు సాగే ఈ ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన 300 మంది కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమానికి నగర మేయర్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు.

'Telangana Art Festival-2021' in Raveendrabharathi tomorrow
'రవీంద్రభారతిలో రేపు 'తెలంగాణ కళా ఉత్సవం-2021''
author img

By

Published : Mar 15, 2021, 5:11 PM IST

కరోనా కాలంలో ఆర్థికంగా చితికిపోయిన కళాకారులను ఆదుకునేందుకు 'తెలంగాణ కళా ఉత్సవం-2021' పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు దర్శక నిర్మాత, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ రియల్ స్టేజ్ ఆర్టిస్ట్స్ (టార్సా) అధ్యక్షుడు విక్రమాదిత్య వెల్లడించారు. ఈ నెల 16న రవీంద్రభారతి వేదికపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రంగాలకు చెందిన 300 మంది కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో సమావేశం ఏర్పాటు చేశారు.

12 గంటల పాటు నిర్విరామంగా జరిగే ఈ ఉత్సవాలకు నగర మేయర్, తదితర ప్రముఖులు హాజరవుతారని విక్రమాదిత్య తెలిపారు. ఈ సందర్భంగా అదే వేదికపై తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ రియల్ స్టేజ్ ఆర్టిస్ట్స్​ సంస్థ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. సమావేశంలో సంస్థ సలహాదారు, ప్రముఖ గాయని విజయలక్ష్మి, నటి శ్రీవాణి, నాగేంద్ర నాయక్, వీఆర్కే చారి, సీహెచ్. వెంకట రమణ, యాట నవీన్​లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఏప్రిల్ నుంచి 5 కొత్త ఆదాయ పన్ను నియమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.