ETV Bharat / state

అంచనాలకు.. వాస్తవ సాగుకి పొంతన లేదు - తెలంగాణ వ్యవసాయ వార్తలు

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. ఇందుకోసం ప్రణాళికలు సైతం రూపొందించింది. అయితే, గణించిన పంట లెక్కలకు... వాస్తవ సాగుకి మధ్య పొంతన లేకుండా పోయింది. 2020-21కి సంబంధించి వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. వరి విస్తీర్ణం పెరగగా... జొన్న, కంది, పెసర, నువ్వులే సాగు తగ్గిందని వెల్లడించింది.

telangana agriculture department 2020-21 report
అంచనాలకు.. వాస్తవ సాగుకి పొంతన లేదు
author img

By

Published : Aug 23, 2020, 5:40 AM IST

ఇటీవల 2020-2021కి సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో నిర్ణయించింది. నియంత్రిత సాగు విధానం అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఈ లెక్కలు వాస్తవంగా అనుసరణలోకి రాలేదు. వరి విస్తీర్ణం ఒక్కటే పెరిగిందని... ఇతర పంటల సాగు తగ్గిందని వ్యవసాయ శాఖ నివేదిక తెలిపింది. జొన్న, కంది, పెసర, నువ్వులు, సోయాబీన్, చెరకు, పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆముదం, ఇతర నూనె గింజల విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. మొక్క జొన్న విస్తీర్ణం గురించి ప్రణాళికలో ప్రస్తావించకపోయినప్పటికీ.....సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు నివేదిక చెబుతోంది. పత్తి సాగు సైతం ప్రభుత్వ అంచనాలను అందుకోలేదని పేర్కొంది.

దిగుమతులే దిక్కు

వరి మినహా ఇతర పంటల సాగు గణనీయంగా తగ్గడం వల్ల.... దిగుమతుల మీద ఆధార పడాల్సి వస్తుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం పెరగటం వల్ల విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల.. రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషం వరకూ పంటల ప్రణాళిక రూపొందించకపోవటం ఇందుకు కారణమని చెబుతున్నారు. ఫలితంగా రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు.

రైతుల సంఖ్య పెరిగింది

ఈ నివేదిక ప్రకారం స్థూల పంట సాగు భూముల విస్తీర్ణం కోటీ 42 లక్షల 68 వేల ఎకరాలు కాగా.... నికర సాగు కోటీ 15,15,000 ఎకరాలుగా ఉంది. రాష్ట్రంలో నీటి పారుదల ఉన్న స్థూల సాగు భూముల విస్తీర్ణం 77,37,000 ఎకరాలు కాగా.... నికర సాగు 54,16,000 ఎకరాలుగా ఉంది. 2019-20 డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో రైతుల సంఖ్య 53,60,000 మంది ఉన్నారు. వ్యవసాయ కూలీల సంఖ్య 59,15,000 ఉండగా.... 2011 జనాభా గణాంకాల ప్రకారం 31,60,000 మంది సాగుదారులుగా నమోదు అయ్యారు. తాజా లెక్కల ప్రకారం 22 లక్షల మంది రైతులు పెరిగారు.

వానాకాలం సీజన్‌కు కోటి 26,34,000 వేల ఎకరాలకు సంబంధించి వ్యవసాయ శాఖ పంటల ప్రణాళిక రూపొందించిగా.... ఆగస్టు 12న విడుదల చేసిన వారాంతపు నివేదిక ప్రకారం కోటి 20 లక్షల 33 వేల 667 ఎకరాలలో పంటలు సాగు అవుతున్నాయి.

ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.