Dalit Bandhu 2nd Phase from October 2 : రాష్ట్రంలో రెండో విడత దళితబంధు పథకం(Dalit Bandhu) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఆశావహుల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలన మొదలైంది. అందులో ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులను ఎమ్మెల్యేలతో కలిసి ఎంపిక చేయాలని కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో దళితబంధు కోసం భారీగానే దరఖాస్తులు వచ్చి.. వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎమ్మెల్యేల ఆమోదంతో అర్హుల జాబితాను ఎస్సీ కార్పొరేషన్(SC Corporation)కు అందించేందుకే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 72 నియోజకవర్గాలలో 50 వేల దరఖాస్తులు పరిశీలన జరుగుతోందని అధికారులు తెలుపుతున్నారు.
Dalit Bandhu Scheme in Telangana : తొలివిడత 38వేల 323 కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేసిన సర్కారు రూ.4,441.80 కోట్లను ఖర్చుచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేసింది. రెండోవిడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా 1,30,000 కుటుంబాలకు పథకం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అందులో జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైనా.. కొన్ని జిల్లాల్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మరికొన్ని జిల్లాల్లో పూర్తయింది. గ్రామాలవారీగా అర్హులైన దళిత కుటుంబాలతో జాబితాకు ఎమ్మెల్యేల ఆమోదం అనంతరం.. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. ప్రస్తుతం 72 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలుకాగా.. మిగతా నియోకవర్గాల్లో త్వరలో ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా లబ్ధిదారుల జాబితాలు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి చేర్చేలా అధికారులు పనిచేస్తున్నారు.
Dalit Bandhu In Telangana : దళితబంధు రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
Telangana Dalit Bandhu Scheme 2023 : దళితబంధు తొలివిడత(First Phase Dalit Bandhu) లబ్ధిదారుల ఎంపికలో కొందరి ఎమ్మెల్యేల తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా మళ్లీ రెండోవిడతలోనూ ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. తొలివిడతలో ఎమ్మెల్యేల అనుచరులకు, కమీషన్లు తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేశారనే ఆరోపణలు ఎన్నో వచ్చాయి.. వీటిపై సీఎం కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
దీనిపై కొందరు హైకోర్టుకు వెళితే లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసు అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. అయితే ఎమ్మెల్యేలతో కలిసి ఎంపిక చేయాలని సూచనలు ఇచ్చింది. మళ్లీ అదే తీరు వ్యక్తమవుతుంది.
KTR Will Start Second Phase Dalit Bandhu : గాంధీ జయంతి రోజు అక్టోబరు 2న దళితబంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించి.. లబ్ధిదారులకు చెక్లు పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 162 మంది లబ్ధిదారులకు మురుగునీటి వ్యర్థాల రవాణా వెహికల్స్ను అందించనున్నారు. దీనిపై ఎస్సీ కార్పొరేషన్ కూడా నిర్ణయం తీసుకుంది.
దళిత బంధు నిధుల్లో గోల్‌మాల్.. చేతివాటం చూపుతున్న దళారులు
Dalit Bandhu 2nd Phase : 'ఎమ్మెల్యేలు చెప్పిన వారికే దళితబంధు..' రెండో విడతలోనూ సేమ్ టు సేమ్