హైదరాబాద్ దక్షిణమండలం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్ కుమార్‌కు కేంద్ర హోంశాఖ ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. కేసు విచారణలో తనదైన శైలిలో విచారణ చేపట్టి నేరస్థులకు శిక్షపడేలా దర్యాప్తు చేసేవారు. పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా ఉన్న సమయంలో 2015జూలైలో సంచలనం రేపిన హత్య కేసును దర్యాప్తు చేసి న్యాయస్థానం ముందు అభియోగపత్రం దాఖలు చేశారు. న్యాయస్థానం ఐదుగురు నిందితులకు 5 ఏళ్ల శిక్ష విధించింది. ఓ అత్యాచారం కేసులో నిందితులకు కోర్టు 10 ఏళ్లు శిక్ష విధించింది. కేసుల దర్యాప్తులో తన నైపుణ్యతను ఉపయోగించి ముద్దాయిలకు శిక్షపడేలా చేసిన కృషిని కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మోహన్‌కుమార్‌ను అభినందించారు.
ఇదీ చూడండి :'ఎవరు' మాట్లాడలేదు నేనే మాట్లాడాను : నటి రెజీనా