ETV Bharat / state

'రైతులందరికీ.. రైతుబంధు ఇవ్వాలి'

author img

By

Published : Jun 18, 2020, 5:25 AM IST

కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులందరికీ రైతుబంధు సాయం చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. కౌలు, పోడు వ్యవసాయం చేసుకొనే రైతులకు కూడా వర్తింపజేయాలని కోరారు.

TELANAGA RAITHU SANGAM ON RAITHU BANDU SCHEME
'రైతులందరికీ.. రైతుబంధు ఇవ్వాలి'

రైతుబంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులకు వర్తింప చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతు బంధు సాయంపై జనవరి 23 వరకు పాస్‌బుక్‌ ఉన్న వారికే సాయం అని విడుదల చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు.

కరోనా లాక్‌డౌన్‌ వల్ల అనేక మంది రైతులకు పాస్ ​పుస్తకాలు అందలేదని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు పి.జంగారెడ్డి తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పాస్​ పుస్తకాలు జారీ చేసి రైతుబంధు అమలు చేయాలని కోరారు. కౌలు, పోడు, దేవాదాయ భూములు సాగు చేసే రైతులందరికీ రైతుబంధు వర్తింపజేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.