ETV Bharat / state

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పెరగాలి: సీఎం కేసీఆర్​ - మంత్రివర్గ సమావేశం

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ మరింతగా పెరగాలని, ఇందుకోసం వ్యవసాయ యంత్రాల గణన చేపట్టి అవసరాలను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని నిర్ణయించిన కేబినెట్... ఇందుకోసం సమగ్ర విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేసిన రైతులను అభినందించిన మంత్రివర్గం... రైతుబంధు ఇంకా అందని రైతులను గుర్తించి సాయం అందించాలని అధికారులకు తెలిపింది.

telagana-cabinet-on-agriculture
రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పెరగాలి: సీఎం కేసీఆర్​
author img

By

Published : Aug 6, 2020, 5:10 AM IST

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు, నియంత్రిత సాగు సహా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించింది. ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను కేబినెట్ అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగు విధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం తమకోసమే చెప్పిందని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి, పరివర్తనా శీలతకు నిదర్శనమని అభిప్రాయపడింది. నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 13 లక్షల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10 నుంచి12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని... వీటికి తోడు మరో 8 లక్షల 65 వేల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.

వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది..

గత వానాకాలంలో రాష్ట్రంలో కోటి 22 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, ఈ సారి కోటి 30 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు జరుగుతోందని వారు వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం, పంటల దిగుబడి పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రివర్గం... తెలంగాణ వ్యవసాయం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఇటీవల భారత ఆహార సంస్థ సేకరించిన ధాన్యంలో రాష్ట్రం వాటా 55 శాతంగా తేలడమే ఈ విషయాన్ని నిరూపించిందని అభిప్రాయపడింది. రైతుబంధు ద్వారా ఈ వానాకాలంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రైతులకు నగదు సాయం అందిందని, కరోనా కష్టకాలంలో ఇది రైతులకు బాగా ఉపయోగపడిందని మంత్రులు అన్నారు. కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి, 57.62 లక్షల మంది రైతులకు, 7,251 కోట్ల రూపాయలు అందించడం అసాధారణమని అన్నారు. ఇంకా ఎక్కడైనా రైతులు మిగిలిపోయి ఉంటే వారిని గుర్తించి సాయం అందించాలని అధికారులను కేబినెట్ కోరింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రాల గణన చేపట్టి ఇంకా ఎన్ని అవసరమో గుర్తించాలని అధికారులను కోరారు.

వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలి..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్న సీఎం... రైతు వేదికలకు స్థలం ఇచ్చినా, నిర్మాణానికి నిధులు ఇచ్చినా వారు సూచించిన వారి పేరును వేదికకు పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయం లాభసాటిగా మారడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు పెట్టాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అభినందించింది. రైతులకు లాభసాటి ధర రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు నెలకొల్పాలని, ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే మంత్రులు, అధికారులు సమావేశమై ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​ల విధానాన్ని రూపకల్పన చేయనున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.