Teachers Arrest: రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను హడావుడిగా అమలుచేస్తూ... ఇష్టారాజ్యంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తోందని ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టారు. అభ్యంతరాలను పరిష్కరించకుండా పోస్టింగ్‌లు ఎలా ఇస్తారంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు... విభజన, కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందంటూ... సచివాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు యత్నించాయి. విడతల వారీగా సచివాలయ ముట్టడికి యత్నిస్తున్న ఉపాధ్యాయులను... బీఆర్కే భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో తెలుగుతల్లి పైవంతెన కింద రోడ్‌పై ఉపాధ్యాయులు బైఠాయించారు. జీవో 317ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
Teachers Transfers 2021 : కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు కొంత గందరగోళంగా మారింది. తమను జిల్లాలకు కేటాయించడంలో స్థానికతను పరిశీలించలేదంటూ కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితాను తప్పులతడకగా మార్చి కేటాయింపులు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు ధర్నాలకు దిగుతున్నారు.
సాధారణ బదిలీలకే నెలరోజుల సమయం తీసుకుంటారని, అలాంటిది శాశ్వత కేటాయింపులను హడావుడిగా చేయడంపై విద్యాశాఖ అధికారులే అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. సీనియారిటీ జాబితాను విడుదల చేసి అందులో తప్పులు సరిచేశాక జిల్లాలను కేటాయించాలి. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. కొన్ని జిల్లాల్లో కనీసం జాబితాను విడుదల చేయకుండా అధికారులు జిల్లాలు కేటాయించారు.
ఇవీ చూడండి: