ETV Bharat / state

తెలంగాణలో విద్యా వ్యవస్థపై వివక్ష: రామచంద్రరావు - వేతనాల కోసం ఉపాధ్యాయుల ధర్నా

తమ సమస్యల సాధన కోసం వృత్తి, కళా, వ్యాయామ, కంప్యూటర్ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. 12 నెలలుగా వేతనాలు లేక తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Teachers protest wages were not paid at hyderabad
వేతనాలు ఇవ్వలేదని ఉపాధ్యాయుల ధర్నా
author img

By

Published : Dec 21, 2020, 7:29 PM IST

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ చాలా నష్టపోయిందని ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వృత్తి, కళా, వ్యాయామ, ఉపాధ్యాయులు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. ఆ శిబిరాన్ని ఎమ్మెల్సీ రామచంద్రరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక ఖాళీలను భర్తీ చేయని కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆయన మండిపడ్డారు.

ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని రామచంద్రరావు అన్నారు. వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు వృత్తి, కళా, వ్యాయామ, కంప్యూటర్ రంగాల్లో రాణించే విధంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.

2012 నుంచి విధులు నిర్వహిస్తున్న 2,600 మంది వృత్తి, కళా, వ్యాయామ, కంప్యూటర్ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్ర శిక్ష అభియాన్​కు నిధులు మంజూరైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టిందని ఆరోపించారు.

12 నెలలుగా జీతాలు లేక తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని వృత్తి, కళా, వ్యాయామ, కంప్యూటర్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రైస్ ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ తెలిపారు.

ఇదీ చూడండి : కరోనా వైరస్ స్ట్రెయిన్​తో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.