నాటాన్ లెర్నింగ్ అసోసియేషన్, సిద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని వీఎస్ఎల్ విజువల్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు డాక్టర్లను సత్కరించారు.
గురు బ్రహ్మ, గురు విష్టు అనే విషయాలను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరముందని నాటాన్ లెర్నింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. ఆశిష్ చౌహాన్ అన్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో వైద్యులు ఎంతో శ్రమిస్తున్నారని.. వారి సేవలను గుర్తించి సన్మానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!