ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగ లేఖ - telugudesham party

ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ బహిరంగ లేఖ రాశారు. సన్నరకాల వరి పంటను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు 500రూపాయలు అదనపు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

tdp state president ramana open letter to cm kcr about paddy purchases in telangana
సీఎం కేసీఆర్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగ లేఖ
author img

By

Published : Nov 6, 2020, 2:38 PM IST

రాష్ట్రంలో నియంత్రిత సాగులో భాగంగా సన్నరకాల వరి పంటను సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ బహిరంగ లేఖ రాశారు. నియంత్రిత సాగులో భాగంగా రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట వేశారని తెలిపారు. 24 లక్షల ఎకరాల్లో బీపీటీ, తెలంగాణ సోనా, జై శ్రీరామ్, హెచ్​ఎంటీ వంటి సన్న రకాలు సాగు చేశారన్నారు. అందులో దాదాపు 80శాతం వరకు కోతలు పూర్తైనా.. ప్రభుత్వం ఇప్పటికీ మద్దతు ధర ప్రకటించకపోవటం వల్ల రైతులు మిల్లర్లకు తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు.

గతంలో సన్నాలకు మిల్లర్లు 2500 వందలు ధర చెల్లించేవారని.. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన 1888 మద్దతు ధరకే కొనుగోళ్లు చేస్తుండటం వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు చాలా వరకు పంటనష్టం వాటిల్లిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం సన్నరకాల కొనుగోళ్లపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్​ చేశారు. క్వింటాలుకు 500వరకు అదనపు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి... 20 నిమిషాలు నరకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.