తెలుగుదేశం పాలనలో ఆరోగ్య రాజధానిగా వెలుగొందిన హైదరాబాద్ నేడు తెరాస పాలనలో ఆందోళనకరంగా మారిందని తెదేపా నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. హైదరాబాద్లోని కోఠిలో తెదేపా శ్రేణులు ధర్నా చేపట్టారు. నిలోఫర్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రులో కుట్లు వేసే దారం లేక 100కు పైగా ఆపరేషన్లు నిలిపివేయడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని విమర్శించారు.
సరైన సౌకర్యాలు లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోతున్న వారి సంఖ్య గణణీయంగా పెరిగింపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యలతో ప్రభుత్వం కుమ్మకై ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తుందన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే... ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్యం చేయించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: రియల్టర్ హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు