ETV Bharat / state

జగన్మోహన్​ రెడ్డిపై నారా లోకేశ్​ మండిపాటు - nara lokesh latest comments

ఆంధ్రప్రదేశ్​లో పేదల స్థలాలు బలవంతంగా లాక్కొని తిరిగి పేదలకు అమ్మడమే 'జగన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకం' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. వైకాపా ల్యాండ్ మాఫియా చేస్తోందని విమర్శించారు.

TDP Politician nara lokesh comments on AP CM Jaganmohan Reddy
జగన్మోహన్​ రెడ్డిపై నారా లోకేశ్​ మండిపాటు
author img

By

Published : Jun 24, 2020, 7:03 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కాళ్లు మొక్కుతామని పేదలు వేడుకున్నా... వైకాపా ప్రభుత్వం కనికరించలేదని నారా లోకేశ్ మండిపడ్డారు. గతంలో తెదేపా ప్రభుత్వం హయంలో 964 మంది పేదలకు ఇచ్చిన 50 ఎకరాల భూమిని.. ఇప్పుడు జగన్ రెడ్డి దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా చేస్తోన్న అక్రమాలు అన్నీ.. ఇన్నీ కావని ధ్వజమెత్తారు.

  • ఎమ్మిగనూరులో ఏం జరిగిందంటే..
    ఎమ్మిగనూరు శివన్ననగర్‌లో పేదలు వేసుకున్న దాదాపు 100 గుడిసెలను పట్టణ సీఐ ప్రభాకర్‌రెడ్డి, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి, పురపాలక కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి సమక్షంలో మంగళవారం తొలగించారు. కొందరు లబ్ధిదారులు సీఐ కాళ్లు పట్టుకొని ‘మా స్థలాలు మాకు ఇప్పించండి’ అని వేడుకున్నారు. ఆందోళన చేస్తోన్న పట్టాదారులను పోలీసులు బలవంతంగా మినీ లారీలో పోలీసుస్టేషన్‌కు తరలించారు. తెదేపా హయాంలో 1999లో మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 ఎకరాల్లో 964 పట్టాలను వీరికి పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల పట్టాలను అధికారులు రద్దు చేసినట్లు తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ప్రకటించారు.

ఇదీ చూడండి : కోర్టు తీర్పు అమలులో ప్రభుత్వ జాప్యం: నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.