ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కనుమరుగైన తెదేపా - telugudesham party

గ్రేటర్​ ఎన్నికల్లో తెదేపా పూర్తిగా చతికిలపడింది. 106 స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించినా ఎక్కడా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. తెదేపాను గెలిపించినా కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మళ్లీ అధికార తెరాసలో చేరరనే నమ్మకం ఏముంటుందని పార్టీ అభిమానులు ప్రచారం సందర్భంగా ప్రశ్నించారని ఓ ముఖ్యనేత వివరించారు.

tdp performance in ghmc elections
జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కనుమరుగైన తెదేపా
author img

By

Published : Dec 5, 2020, 9:42 AM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలపడింది. మొత్తం 150కి గాను 106 డివిజన్లలో అభ్యర్థులను రంగంలోకి దించినా ఎక్కడా కనీసం పోటీ ఇవ్వలేక ఫలితాల్లో కనుమరుగైంది. ప్రస్తుత ఎన్నికల్లో 90 శాతం టిక్కెట్లు బడుగు, బలహీనవర్గాలకే ఇచ్చినట్లు పార్టీ ప్రచారం చేసుకుంది. ఆటోడ్రైవర్‌ సతీమణికి ఓ డివిజన్‌లో, పాలు అమ్ముకునే సాధారణ వ్యక్తికి మరోచోట...ఇలా పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలకే ఎక్కువ టిక్కెట్లు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయినా చివరికి ఫలితాలు నిరాశపరిచాయని తెదేపా నేతలు వాపోతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా, తెరాస నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచారని, తాము డబ్బును పంచకుండా నిజాయితీగా ప్రచారం చేశామని నగర ఎన్నికల కమిటీ కన్వీనర్‌ అరవిందకుమార్‌గౌడ్‌ చెప్పారు.

పార్టీ మారరన్న నమ్మకం లేకే..!

2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం కేవలం కేపీహెచ్‌బీ డివిజన్‌లో మాత్రమే తెదేపా నెగ్గింది. గెలిచిన కొద్దిరోజులకే ఆ ఒక్క కార్పొరేటర్‌ అధికార తెరాస పార్టీలో చేరిపోవడం పార్టీ శ్రేణులను నిరాశపరిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడైనా తెదేపాను గెలిపించినా కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మళ్లీ అధికార తెరాసలో చేరరనే నమ్మకం ఏముంటుందని పార్టీ అభిమానులు ప్రచారం సందర్భంగా ప్రశ్నించారని ఓ ముఖ్యనేత వివరించారు. పార్టీపై అభిమానమున్నా గెలిచినవారు అధికార పార్టీలోకి వెళ్లడం వల్ల వారు కూడా ఓట్లు వేయడానికి ఆసక్తి చూపలేదని ఆయన విశ్లేషించారు. తెదేపా ఎటూ గెలవలేదని, కొందరు భాజపా వైపు మొగ్గుచూపారని ఆయన తెలిపారు.

2002లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరగగా మేయర్‌ స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) అవతరించింది. అనంతరం 2009లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా తెదేపా మొత్తం 150 డివిజన్లకు గాను 45 స్థానాలు దక్కించుకుంది. కానీ ఎక్కువ స్థానాలు నెగ్గిన కాంగ్రెస్‌, ఎంఐఎం కలిసి చెరో రెండున్నర ఏళ్లు మేయర్‌ పదవి పంచుకున్నాయి. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్‌లో తెదేపా సత్తా చాటింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా వాటిలో అత్యధిక సీట్లు గ్రేటర్‌లోనే సాధించింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ బలహీన పడుతూ వచ్చింది. తెదేపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి తెరాసలో చేరారు.

ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును, వారి నిర్ణయాన్ని తెదేపా గౌరవిస్తుంది. తెరాస రూ.కోట్లు గుమ్మరించి గెలుపొందింది. తెదేపా శ్రేణుల్లో నెలకొన్న స్తబ్ధత తొలగించి ఉత్సాహం నింపడానికి ఎన్నికల బరిలోకి దిగాం. ఫలితాలను సమీక్షించుకొని మున్ముందు పూర్తి కార్యాచరణతో ముందుకు వెళతాం. - ఎల్‌.రమణ, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి: నలుగురు అమాత్యుల పరిధిలో అభ్యర్థులకు తప్పని ఓటమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.