ETV Bharat / state

మదర్ థెరిసాకు నివాళులర్పించిన తెదేపా నాయకులు!

మదర్​ థెరిసా వర్ధంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్​లోని రెజిమెంటల్​ బజార్​ వద్ద ఉన్న ఆమె విగ్రహానికి తెదేపా నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మల్కాజ్​గిరి ప్రధాన కార్యదర్శి ముప్పిడి మధుకర్​ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. మదర్​ థెరిసా చేసిన సేవలను కొనియాడారు.

author img

By

Published : Sep 5, 2020, 7:54 PM IST

tdp pays tributes to mother teresa in secundrabad
మదర్ థెరిసాకు నివాళులర్పించిన తెదేపా నాయకులు!

సికింద్రాబాద్​లోని రెజిమెంటల్​ బజార్​ వద్ద ఉన్న మదర్​ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మదర్​ థెరిసా వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా మల్కాజ్​గిరి ప్రధాన కార్యదర్శి ముప్పిడి మధుకర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ప్రతి వ్యక్తి మదర్​ థెరిసాలా సేవాగుణాన్ని కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుత కరోన విపత్కర పరిస్థితుల్లో రోగులకు సేవలందిస్తున్న వారంతా మదర్​ థెరిసా మరో రూపాలని ఆయన అన్నారు. మానవసేవే మాధవసేవ అని భావించి ప్రతి మనిషికి సహాయపడుతూ.. సేవా గుణాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు కట్టల శ్రీనివాస్​ యాదవ్​, నాగరాజు గౌడ్, కైలాష్, శ్రీరాములు యాదవ్​, జయరాజ్​, వెంకటేశ్​, అశోక్​ యాదవ్​, యాదగిరి, హరి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.