గల్వాన్ లోయలో బాంబు స్క్వాడ్‌లో పని చేస్తూ మృతి చెందిన జవాన్ ఉమామహేశ్వరరావు కుటుంబానికి తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. జవాన్ మృతి తనని తీవ్రంగా కలిచివేసిందన్నారు.
దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. జవాన్ మృతిపై కనీసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు.