ETV Bharat / state

'చట్టాలను పటిష్ఠంగా అమలు చేయండి...'

author img

By

Published : Dec 4, 2019, 6:22 PM IST

చట్టాలను పటిష్ఠంగా అమలు చేసి దిశా హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య కోరారు. మహిళలు స్వీయ నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని దాడులు తిప్పికొట్టాలని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ సూచించారు.

TDP LEADERS RESPONDED ON DISHA INCIDENT AT HYDERABAD PRESS CLUB

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, హాత్యాచారాలపై మహిళలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సూచించారు. మహిళల రక్షణ కోసం కల్పించిన చట్టాలని పటిష్ఠంగా అమలు చేసి దాడులు, హత్యలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్​క్లబ్​లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో... సమావేశం నిర్వహించారు. దిశ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, దశల వారిగా మద్యపానాన్ని నిషేధించాలని కృష్ణయ్య డిమాండ్​ చేశారు. సామాజిక మాధ్యమాల్లో, సెన్సాన్ బోర్డుపై ప్రత్యేక దృష్టి సారించి అశ్లీల దృశ్యాలను నిషేధించాలన్నారు.

మహిళలపై జరుగుతున్న దాడులను, హత్యాచారాలను తెతెదేపా అధ్యక్షుడు ఎల్​. రమణ తీవ్రంగా ఖండించారు. మహిళలు స్వీయ నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని దాడులను తిప్పికొట్టాలని సూచించారు.

'చట్టాలను పటిష్ఠంగా అమలు చేయండి...'

ఇవీ చూడండి: ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.