ETV Bharat / state

మనోళ్లతోనే మనోళ్లకు టోకరా - చైనా దుండగుల సరికొత్త సైబర్‌ దండయాత్ర - Chinese Cyber Fraud With Indians

Chinese Cyber Criminals Crime : చైనా సైబర్​ ముఠాలు మన కంటిని మన వేలితోనే పొడుస్తున్నాయి. మన వాళ్లతో మనోళ్లనే మోసం చేయడం ఇప్పుడు వారి కొత్త ట్రెండ్. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలంటూ ఆశ చూపి భారతీయ యువకులకు సైబర్‌నేరాలు చేసేలా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం కొట్టేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. ఇదంతా గోల్డెన్ ట్రయాంగిల్‌లోని అడ్డాల్లో వెలుగుచూసిన సరికొత్త దందా.

Chinese Cyber Criminals Fraud with Indian youth
Chinese Cyber Criminals Crime (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 4:04 PM IST

Chinese Cyber Criminals Fraud with Indian youth : సైబర్​ వలలో చిక్కి మోసపోయేది మనోళ్లే, మోసగించేదీ మనోళ్లే. కానీ దాని వల్ల లాభపడేది మాత్రం చైనా ముఠాలు. ఇప్పుడు సైబర్​ నేరాల్లో నడుస్తున్న కొత్త ట్రెండ్​ ఇదే. సూత్రధారులంతా చైనా దుండగులే అయినా ఎక్కడా తమ జాడ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. ఇదంతా ‘గోల్డెన్‌ ట్రయాంగిల్‌’లోని అడ్డాల్లో సాగుతున్న కొత్త తరహా సైబర్​ నేరాల దందా. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్లేషణలో వెల్లడైన సమాచారం విస్తుపోయేలా చేస్తోంది. మొదట సోషల్​ మీడియా ద్వారా కాల్‌సెంటర్‌ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనాలంటూ ప్రకటనలు వేసి ఏజెంట్ల ద్వారా యువకులను లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్‌ సరిహద్దులతో కూడిన ‘గోల్డెన్‌ ట్రయాంగిల్‌’కు రప్పిస్తున్నారు.

అక్కడే చైనా సైబర్​ ముఠాలు అడ్డాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఉద్యోగం కోసం వెళ్లిన యువకులను విమానాశ్రయాల నుంచే ముఠా సభ్యులు తమ అడ్డాలకు తరలించి పాస్​పోర్టు తీసుకుంటున్నారు. యువతకు 15 రోజులపాటు సైబర్​ నేరాలు చేసేలా శిక్షణ పేరిట మెలకువలు నేర్పిస్తున్నారు. ఈ మోసాలు చేయడానికి ఒప్పుకోకపోతే బెదిరింపులు, చిత్రహింసలకు సైతం గురిచేస్తున్నారు. కొందరు దైర్యం చేసి అక్కడి భారత ఎంబసీకి ఫిర్యాదు చేసివారికి చైనా సైబర్​ ముఠా నుంటి విముక్తి లభిస్తోంది. సైబర్‌ మోసాలకు పాల్పడి కొట్టేసిన సొమ్మును మొదట బ్యాంక్​ ఖాతాల్లోకి తరలిస్తున్నారు.

కమీషన్లకు ఆశపడి ముఠాలకు బ్యాంకు ఖాతాలు : తర్వాత ఆయా ఖాతాల నుంచి వెంటనే పలు ఖాతాల్లోకి మార్చేస్తున్నారు. సైబర్​ కేసు దర్యాప్తు క్రమంలో తొలుత బాధితుడి సొమ్ము బదిలీ అయిన ఖాతాదారుడిని పోలీసులు పట్టుకుంటున్నారు. సైబర్​ ముఠాలు ఇచ్చే కమీషన్​కు ఆశపడి తమ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచి నగదు లావాదేవీల నిర్వహణ అంతా ముఠాలకే అప్పగిస్తున్నారు. వీరినే మ్యూల్స్​ అని అంటారు. రెండురోజుల క్రితం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రాజస్థాన్‌లో అరెస్ట్ చేసిన 27 మంది ఇలాంటి వారే. దర్యాప్తు బృందాలు మ్యూల్స్‌ను గుర్తించేలోగా నగదు ఇతర ఖాతాల్లోకి బదిలీ అవుతోంది. వెంటనే సైబర్​ ముఠాల ఏజెంట్లు ఆ సొమ్మును క్రిప్టోకరెన్సీల్లోకి మార్చి క్రిప్టోఎక్స్ఛేంజీల ద్వారా విదేశీ ఖాతాల్లోకి పంపించేస్తున్నారు.

ఐ4సీ గణాంకాలు వెల్లడించిన కఠిన వాస్తవాలివి

  • ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ)) గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 3.25లక్షల మ్యూల్‌ ఖాతాలను జప్తు చేశారు. 3 వేలకు పైగా యూఆర్‌ఎల్స్‌, 595 యూప్​లను బ్లాక్​ చేశారు. 5.3లక్షల సిమ్‌కార్డులతో పాటు 848 ఐఎంఈఐ నంబర్లను సస్పెండ్​ చేశారు.
  • ఇండియాలో ఈ ఏడాది జనవరి నుంచి నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు రోజూ సగటున 7 వేల ఫిర్యాదులోస్తున్నాయి. వీటిలో 85 శాతానికిపైగా ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలకు సంబంధించినవి.
  • చైనా ముఠాలు ఫిలిప్పీన్స్, కంబోడియా, సింగపూర్‌, మలేసియాలాంటి దేశాల్లో అడ్డాలు చేసుకున్నాయి.
  • ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే సైబర్‌ ముఠాలు రూ.7,061.51 కోట్లను దొచుకున్నారు. కొందరు బాధితులు గోల్డెన్‌ అవర్‌(తొందరగా)లో ఫిర్యాదు చేయడంతో పోగొట్టుకున్న దాంట్లో రూ.812.72కోట్లను దర్యాప్తు సంస్థలు రికవరీ చేశాయి.
  • మే 22న కంబోడియా రాజధాని నామ్‌పెన్‌లోని సైబర్​ ముఠా అడ్డాల్లో నుంచి 360 మంది భారతీయుల్ని అక్కడి ఎంబసీ అధికారులు విడిపించారు. మయన్మార్‌, కంబోడియా అడ్డాల్లోని సుమారు 5 వేల మంది భారతీయ యువకులతో సైబర్‌ నేరాలు చేయిస్తున్నట్లు విడుదలైన వారు తెలిపారు.

దోపిడీ కొండంత - రాబట్టేది గోరంత - సైబర్​ మోసాల సొమ్ము రికవరీలో పోలీసుల అలసత్వం - Less Recoveries in Cyber Crimes

మీ అకౌంట్​లో డబ్బు జమ అయినట్లు మెసెజ్​ వచ్చిందా? - అది డమ్మీ కావొచ్చు, బ్యాలెన్స్ చెక్​ చేసుకోండి - Dummy Messages Cyber Crime in hyd

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.