ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఏపీ గవర్నర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. 145కి పైగా ఘటనలు జరిగాయని తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న ఉన్నారు.
డీజీపీ తన విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. దాడులు చేసిన వారిని వదిలి తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 145 ఆలయాలపై దాడులు జరిగినా ఒక్కరినీ అరెస్టు చేయలేదని ధూళిపాళ్ల నరేంద్ర.. అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. విధ్వంసక ఘటనలను ప్రోత్సహించేలా మంత్రుల వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రామతీర్థానికి ఎంతో చరిత్ర ఉంది, వైకాపా నేతలు దాన్ని చదవాలని హితవు పలికారు.