రాష్ట్రంలో వైద్య వ్యవస్థ పడకేసిందని తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు గవర్నర్‌ను కలిశారు. తాజా వైద్య పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరారు. విష జ్వరాల వల్ల ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని...వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని గవర్నర్‌కు విన్నవించారు.
ఇవీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!