JC PRABHAKAR ON MLA PEDDAREDDY : ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి కోర్టులో తన మీద పోలీసులు వేసిన ఛార్జ్‌షీట్ మాయమైందని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎవరు చెప్పారని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో తనపై 29 కేసులు పెట్టారని, తాడిపత్రిలో వేసిన ఒక కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీటు తాను ఎందుకు మాయం చేస్తానో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, చార్జిషీట్ విషయం డీఎస్పీ సమాచారం ఇచ్చారని ఆరోపించారు.
కోర్టులో విషయాలు ఎవరు చెప్పారో తేల్చాలని ఆయన కోరారు. పెద్దారెడ్డి ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాల్సి ఉందన్నారు. కోర్టులో ఉన్న ఛార్జ్‌షీటు పోయిందన్న విషయం జిల్లా ఎస్పీకి అయినా తెలిసిందో లేదో కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మాత్రం సమాచారం ఎలా వెళ్లిందని జేసీ ప్రశ్నించారు. కోర్టులంటే తనకు అపారమైన గౌరవం ఉందని, కోర్టును కించపరిచేలా ఛార్జ్‌షీట్ పోయిందని మాట్లాడిన పెద్దారెడ్డిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు.
ఇవీ చదవండి: