ETV Bharat / state

'రాష్ట్రమంతా రివర్స్ పాలన .. జగన్​ను నమ్మి ప్రజలు మోసపోయారు' - రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు వార్తలు

Chandrababu Fires On State Government: తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. జగన్​ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని నమ్మి ప్రజలు మోసపోయారని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఏపీలోని కర్నూలు చేరుకున్నారు.

Chandrababu fires on state government
Chandrababu fires on state government
author img

By

Published : Nov 16, 2022, 3:53 PM IST

Chandrababu Fires On State Government: రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానాశ్రయంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి.. గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

జగన్ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని అనుకుని నమ్మి మోసపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు విమానాశ్రయాన్ని తానే కట్టించినట్లు తెలిపారు. తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని స్పష్టం చేశారు. హైదరాబాద్​కు ధీటుగా అమరావతిని నిర్మించాలని భావించానని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావాలని కోరారు. విద్యార్థులకు స్కాలర్​షిప్​లు, చదివించే బాధ్యత తెదేపా తీసుకుంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి లేదని అమరావతిలో రైతుల భూములను కబ్జా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో ప్రజల మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ యూనివర్సిటీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని ధ్వజమెత్తారు. విద్యార్థులు, సిబ్బంది సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా రివర్స్ పాలన నడుస్తోందని.. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదేనని వారికి చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి: చీకోటి క్యాసినో కేసులో మంత్రి సోదరులను విచారిస్తున్న ఈడీ

మద్యం తాగొద్దని చెప్పినందుకు కూతురిని కాల్చి చంపిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.